vijay- Rashmika Mandanna: ఈ ఏడాది మాస్టర్‌తో ప్రేక్షకులను పలకరించిన తలపతి విజయ్ ఇప్పుడు డాక్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డేను ఖరారు చేశారు. ఆమెను తలపతి 65 సినిమాలోకి ఆహ్వానిస్తూ ఇటీవల ఓ అధికారిక ప్రకటనను కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మరో హీరోయిన్‌కి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు గానూ కన్నడ బ్యూటీ రష్మిక మందన్నను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న క్రేజీ హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఇటీవలే రష్మిక బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. అక్కడ ఇప్పటికే రెండు సినిమాలకు ఓకే చేసుకుంది రష్మిక.
ఇక ఇప్పుడు ఆమెకు విజయ్ సినిమాలోనూ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్గా కన్నడలో ఎంట్రీ ఇచ్చి తెలుగులో స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న రష్మిక.. కార్తీ సుల్తాన్ చిత్రంలో తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. ఇక తమిళంలో విజయ్‌కు పెద్ద ఫ్యాన్స్ అయిన రష్మికకు గతంలోనూ ఆయన సరసన నటించే అవకాశం వచ్చినట్లు పలు వార్తలు వినిపించాయి.
View this post on Instagram
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజు తెరకెక్కించిన మాస్టర్‌లో హీరోయిన్గా రష్మికను తీసుకోబోతున్నట్లు అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే చివరగా ఈ మూవీలో మాలవిక మోహనన్ హీరోయిన్గా ఖరారు అయ్యింది. ఇక ఆ తరువాత ఓ సారి అభిమానులతో చాట్ చేస్తూ తనకు విజయ్‌కు పెద్ద అభిమానిని అని, ఆయన సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఇక ఇప్పుడు సమాచారం ప్రకారం విజయ్ సినిమా కోసం ఆమెను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? ఈసారి అయినా ఫ్యాన్ గర్ల్‌కు విజయ్ సినిమాలో అవకాశం వస్తుందా వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Rashmika mandanna, Vijay