Home /News /movies /

RASHMIKA MANDANNA TO DO A SPECIAL SONG ON VIJAY DEVARAKONDA PURI JAGANNADH LIGER HERE ARE THE DETAILS SR

Vijay Devarakonda | Rashmika Mandanna : విజయ్‌తో మరోసారి ఆడిపాడనున్న రష్మిక మందన్న..

Vijay Devarakonda and Rashmika Mandanna Photo : Twitter

Vijay Devarakonda and Rashmika Mandanna Photo : Twitter

Vijay Devarakonda | Liger: ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఐటెమ్ నెంబర్ ఉందట. ఈ పాటలో డాన్స్ చేసేందుకు టీమ్ ఇప్పటికే చాలా మందిని పరిశీలించారట. ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కోసం కెజియఫ్ భామ శ్రీనిధి శెట్టిని సంప్రదించడమే కాదు.. ఆమె లైగర్‌‌లో సాంగ్ చేయబోతుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో శ్రీనిధికి బదులుగా రష్మిక మందన్న చేయబోతుందని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    Vijay Devarakonda : విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం పూరి జగన్నాధ్ (Puri Jagannadh) దర్శకత్వంలో  లైగర్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అనన్యపాండే హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ (Liger) కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఇక విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  చాలా రోజుల నుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఐటెమ్ నెంబర్ ఉందట. ఈ పాటలో డాన్స్ చేసేందుకు టీమ్ ఇప్పటికే చాలా మందిని పరిశీలించారట. ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కోసం కెజియఫ్ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ని సంప్రదించడమే కాదు.. ఆమె లైగర్‌‌లో సాంగ్ చేయబోతుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో శ్రీనిధికి బదులుగా రష్మిక మందన్న (Rashmika Mandanna) చేయబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..

    ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్  (Liger) తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు.  ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది. లైగర్ ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు.



    ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో విజయ్, శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇక మరోవైపు విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. విజయ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Puri Jagannadh, Rashmika mandanna, Tollywood news, Vijay Devarakonda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు