RASHMIKA MANDANNA TO ACT WITH KOLLYWOOD SUPER STAR VIJAY 66TH FILM PRODUCED BY DIL RAJU DIRECTED BY VAMSHI PAIDIPALLY TA
Rashmika Mandanna : విజయ్ 66వ చిత్రంలో కథానాయికగా రష్మిక మందన్న.. అధికారిక ప్రకటన..
విజయ్ 66వ చిత్రంలో రష్మిక మందన్న (Twitter/Photo)
Rashmika Mandanna : రష్మిక మందన్న.. కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో సత్తా చాటుతోంది. తాజాగా ఈ భామ.. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Rashmika Mandanna : రష్మిక మందన్న.. కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో సత్తా చాటుతోంది. అంతేకాదు 2020లో నేషనల్ క్రష్‌గా అందరి మనసులు దోచుకుంది. ఇక గతేడాది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది. తాాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ లవ్ స్టోరీలో రష్మిక .. అఫ్రీన్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో నటిస్తోంది. ఈ రోజు ఈమె పుట్టినరోజు సందర్భంగా రష్మిక లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమా పతాపంపై తెరకెక్కుతోంది. ఈ సినిమాను 1970 భారత్, బంగ్లాదేశ్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరో జవాన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్‌ను త్వరలో అపీషియల్‌గా ప్రకటించనున్నారు.
తాజాగా రష్మిక క్రేజీ ప్రాజెక్ట్‌కు సైన్ చేసింది. తాజాగా విజయ్ హీరోగా నటిస్తోన్న 66వ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ తొలిసారి తెలుగులో డైెరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు.
విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు మూవీలో కథానాయికగా రష్మిక మందన్న (Twitter/Photo)
ఇక విజయ్ నటించిన ‘బీస్ట్’ మూవీ ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్గే నటిస్తోంది. మరోవైపు రష్మిక మందన్న ఈ యేడాది శర్వానంద్‌తో కలిసి నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇక రష్మికకు సౌందర్య బయోపిక్ తెరకెక్కిస్తే అందులో హీరోయిన్గా యాక్ట్ చేస్తానంటూ పలు సందర్భాల్లో ప్రస్తావించారు.ఇక సౌందర్య యాక్టింగ్, సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని రష్మిక పేర్కొన్నారు. ఈమెకు తెలుగుతో పాటు కన్నడ, తమిళంతో పాటు హిందీలో దుమ్ము దులుపుతోంది. అంతేకాదు అన్ని భాషల వాళ్లకు రష్మిక ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.
గత యేడాది కార్తి హీరోగా నటించిన ‘సుల్తాన్’ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. అంతేకాదు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు.. ఇపుడు బాలీవుడ్లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే రష్మిక మందన్న.. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో పలకరించబోతుంది. ఆ సినిమా విడుదల కాకుండానే రష్మిక మందన్న బాలీవుడ్లో టాప్ టక్కర్ అనే పాప్ ఆల్బమ్‌తో పలకరించింది. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్ బై’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘యానిమల్’లో కథానాయికగా యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వరుసగా బాలీవుడ్ అవకాశాలు రావడంతో రష్మిక మందన్న.. బాంద్రాలో పూజా హెగ్డే కొత్తగా తీసుకున్న ఫ్లాట్‌కు దగ్గరలో సెలబ్రిటీలు ఉండే ప్రదేశంలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. త్వరలో హైదరాబాద్‌లో కూడా రష్మిక ఉండటానికి ఓ ఇల్లు చూసినట్టు సమాచారం. త్వరలో అక్కడ గృహ ప్రవేశం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో తెరకెక్కుతోన్న ‘పుష్ఫ 2’ ది రూల్ మూవీలో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.