news18-telugu
Updated: December 4, 2019, 7:48 AM IST
రష్మిక మందన్న (Instagram/rashmika_mandanna)
చాలా తక్కువ సమయంలో ఊహించని క్రేజుతో టాలీవుడ్ లో అసాధారణ స్టార్ డమ్ అందుకుంది రష్మిక మందన. ఇప్పటివరకూ టాలీవుడ్ లో ప్రవేశించిన ఏ కన్నడ బ్యూటీకి ఇంత సీన్ లేదని నిరూపించింది ఈ అమ్మడు. ‘ఛలో’, ‘గీత గోవిందం’ లాంటి వరుస బ్లాక్ బస్టర్లు ఈ అమ్మడిని గోల్డెన్ లెగ్ గా నిలబెట్టాయి. గత మూడు సంవత్సరాలుగా విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తూనే ఉన్న రష్మిక బాగా అలసి పోయిందట. అందుకే రెండు నెలల గ్యాప్ లోనే నాలుగు సార్లు అస్వస్థతకు గురైనట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. మూడు యేళ్ల బిజీ షెడ్యూల్స్ కారణంగా కనీస విశ్రాంతి కూడా ఉండడం లేదని ఈ సందర్భంగా తెలిపింది. విశ్రాంతి కోసం తనకు తానుగా కాస్త స్పీడ్ తగ్గించుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఒకే సమయంలో మూడు నాలుగు సినిమాలలో నటిస్తోన్న రష్మిక. తెలుగుతో పాటు కన్నడం మరియు తమిళంలో కూడా నటిస్తోంది. రష్మిక వచ్చే ఏడాది నుండి కాస్త మెల్లగా సినిమాలు చేసి కావాల్సినంత విశ్రాంతి కూడా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చిందట.

రష్మిక మందన్న ఫొటోస్ (credit - insta - rashmika_mandanna)
తన దినచర్యలో స్పీడ్ పెరగడం వల్ల శరీరం మరియు మైండ్ చాలా ఒత్తిడికి గురవు తున్నాయని చెప్పింది దీనితో తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని రష్మిక అంటోంది. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత కాస్త మెల్లగా సినిమాల ఎంపిక చేసుకోవడం.. గ్యాప్ ఉండేలా ప్రయత్నిస్తానంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 4, 2019, 7:48 AM IST