హోమ్ /వార్తలు /సినిమా /

Rashmika Mandanna : జిమ్‌లో రష్మిక మందన్న వర్కౌట్స్.. కిక్కే కిక్కు.. వీడియో వైరల్..

Rashmika Mandanna : జిమ్‌లో రష్మిక మందన్న వర్కౌట్స్.. కిక్కే కిక్కు.. వీడియో వైరల్..

Rashmika mandanna Photo : Instagram

Rashmika mandanna Photo : Instagram

Rashmika Mandanna : రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. అది అలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా ఓ సూపర్ వీడియోను పంచుకుంది. ఆ వీడియో రష్మిక జిమ్’లో తెగ కష్టపడుతోంది.

ఇంకా చదవండి ...

  'Rashmika Mandanna : రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి వరుసగా సూపర్ హిట్‌లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అంతేకాదు ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ లక్కీ అండ్ హిట్స్ ఉన్న హీరోయిన్స్ లో రష్మికా మందన్న కూడా ఒకరు అంటున్నారు. ఇక అది అలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా ఓ సూపర్ వీడియోను పంచుకుంది. ఆ వీడియో రష్మిక జిమ్’లో తెగ కష్టపడుతోంది. ఆ వీడియో చూస్తుంటే.. యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏమైనా రెడీ అవుతుందా అనిపిస్తుంది. ఇందులో తన ట్రైనీతో కిక్ బ్యాగ్ పై సాలిడ్ పంచ్ లు ఇస్తూ గట్టిగా కష్టపడుతున్నారు రష్మిక. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  ఇక రష్మిక మందన్న నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ సుకుమార్ (Allu Arjun Sukumar) కాంబినేషన్‌లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెలలో విడుదలకానుంది. కాగా ఈ సినిమా నుంచి రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. తాజాగా ఆమె లుక్ విడుదలైంది. పుష్పలో రష్మిక లుక్ చాలా డిఫరెంట్’గా ఉంటుందని తెలుస్తోంది. మంచి ఇంటెన్స్ గా‌ లుక్‌లో రష్మిక అదరగొడుతూ.. ఆసక్తి కరంగగా కనిపిస్తుంది.


  Poorna : చీరలో పిచ్చెక్కించిన పూర్ణ.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్...

  ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న  (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song)  అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది.

  Akhil Akkineni : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎనిమిది రోజుల కలెక్షన్స్.. 36 కోట్లతో సూపర్ హిట్ దిశగా..

  ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే  వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే.

  ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఈ సినిమా వచ్చే క్రిస్మస్‌కు ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17న విడుదలకానుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Rashmika mandana, Rashmika mandanna, Tollywood news

  ఉత్తమ కథలు