• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RASHMIKA MANDANNA STAR HEROINE IN TOLLYWOOD SANDALWOOD SHE BECOMES STAR BY THESE HEROINE WAS REJECTED GEETHA GOVINDAM MOVIE HERE ARE THE DETAILS TA

Rashmika Mandanna: రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ కావడానికి ఆ కథానాయిక కారణమా..

Rashmika Mandanna: రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ కావడానికి ఆ కథానాయిక కారణమా..

రష్మిక మందన్న (Twitter/Photo)

Rashmika Mandanna: రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ కావడానికి ఆ హీరోయిన్ కారణమా.. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Rashmika Mandanna: రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ కావడానికి ఆ హీరోయిన్ కారణమా.. వివరాల్లోకి వెళితే..  రష్మిక మందన్నతెలుగులో ‘ఛలో’ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన  ‘గీతా గోవిందం’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.  రష్మిక మందన్నను స్టార్‌ను చేసిన ఈ సినిమాలో ముందుగా అనుకున్న కథానాయిక రష్మిక కాదట. ఈ విషయాన్ని ఓ కథానాయిక రీసెంట్‌గా ఇచ్చిన  ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ సినిమాలో నటించి ఉంటే తన పొజిషన్ వేరేలా ఉండేది అని తన ఆవేదన వ్యక్తం చేసారు. ఇంతకీ ‘గీతా గోవిందం’లో ముందుగా అనుకున్న కథానాయిక ఎవరో కాదు లావణ్య త్రిపాఠి. రీసెంట్‌గా ఈ భామ.. హీరో కార్తికేయతో కలిసి ‘ఆలీతో సరదగా’ ప్రోగ్రామ్‌లో జంటగా పాల్గొన్నారు. వీళ్లిద్దరు కలిసి ఈ మధ్యనే ‘చావు కబురు చల్లగా’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వీళ్లిద్దరు ఆలీతో సరదగా ప్రోగ్రామ్‌లో తమ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

    ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ‘గీతా గోవిందం’ సినిమాలో హీరోయిన్‌గా మొదట తననే అనుకున్నట్టు చెప్పుకొచ్చింది. గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తను ‘భలే భలే మగాడివోయ్’ ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాల్లో యాక్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఆ సినిమాల తర్వాత మరోసారి  ‘గీతా గోవిందం’ సినిమాలో హీరోయిన్‌గా మేకర్స్ తననే ముందుగా సంప్రదించినట్టు చెప్పింది.ఈ టైమ్‌లో  అప్పటికే తనకున్న కమిట్‌మెంట్స్ కారణంగా  ఆ మూవీ చేయలేకపోయాను. దీంతో చిత్ర దర్శక, నిర్మాతలు  అపుడు తన ప్లేస్‌లో రష్మిక మందన్నను తీసుకున్నట్టు చెప్పారు. ఇక గీతా గోవిందం’ సినిమా ఏ రేంజ్‌లో సూపర్ హిట్  అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో రష్మిక మందన్న తెలుగులో టాప్ పొజిషన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే కదా.

    Rashmika Mandanna was The Not First Choice Of Geetha Govindam Movie Here Are The Details,Rashmika Mandanna: ‘గీతా గోవిందం’ మూవీలో రష్మిక మందన్న కంటే ముందు అనుకున్న హీరోయిన్ ఎవరంటే..,Rashmika Mandanna,Rashmika Mandanna Twitter,Rashmika Mandanna Instagram,Rashmika Mandanna Facebook,Rashmika Mandanna Not First Choice Of Geehta Govindam,Geetha Govindam Movie,Lavanya Tripati Not First Choice Of Geetha Govindam,Tollywood,Telugu Cinema,రష్మిక మందన్న,రష్మిక మందన్న సినిమాలు,రష్మిక మందన్న టాలీవుడ్ సినిమాలు,రష్మిక మందన్న బాలీవుడ్ సినిమాలు,రష్మిక మందన్న గీతా గోవిందం,గీతా గోవిందంలో మొదటి అనుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి
    ‘గీతా గోవిందం’ మూవీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Twitter/Photo)


    గతేడాది రష్మిక మందన్న... మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో పాటు ‘భీష్మ’ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఈ యేడాది ‘పొగరు’, సుల్తాన్’ వంటి డబ్బింగ్ సినిమాలతో పలకరించిన ఈ భామ.. త్వరలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ఫ’ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు బాలీవుడ్‌లో ‘మిషన్ మజ్ను’ సినిమాతో పాటు ‘గుడ్ లక్’ మూవీలతో హిందీ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ భామ బాలీవుడ్‌లో నటించిన ‘టాప్ టక్కర్’ పాటతో పాపులర్ అయింది. ఇక గతేడాది రష్మిక మందన్నకు గూగూల్ 2020 సంవత్సరానికి గాను 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా రష్మికను ఎంపిక చేసింది. రష్మిక ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు  తెలుగు,కన్నడ హిందీ డబ్బింగ్ సినిమాలతో  బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు