Home /News /movies /

RASHMIKA MANDANNA SAYS WE EAT PIG MEAT DAILY ON UPASANA SHOW SR

Rashmika Mandanna : మేము పంది మాంసం తింటాం: రష్మిక మందన

రష్మిక మందన Photo : Twitter

రష్మిక మందన Photo : Twitter

Rashmika Mandanna : వెంకీ కుడుముల 'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన రష్మిక మందన.. విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది.

  Upasana Kamineni : ఉపాసన కొణిదెల... ఈ పేరును మరోసారి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. సినీ నటుడు రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో  హాస్పిటల్స్ విస్తరణలో తనదైన పాత్ర పోషిస్తూ అదరగొడుతున్నారు ఉపాసన. అంతేకాదు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ అవసరమున్న వారికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది మెగా కోడులు. ఇక టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌తో పెళ్లి తర్వాత ఉపాసన మంచి ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ప్రజలకు మరింత చేరువవుతున్నారు. అందులో భాగంగా అందరూ ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని ఫాలో అయ్యేందుకు స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో ఉపాసన కొణిదెల "యుఆర్ లైఫ్" అనే వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు. URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం, ముఖ్యంగా ప్రకృతికి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమేనట. ఇక అందులో భాగంగా ఆ మధ్య సమంత వచ్చి ఓ వంట చేసి పోగా.. తాజాగా రష్మిక మందన వచ్చింది. రీఛార్జ్ యువర్ లైఫ్ విత్ రష్మిక అనే శీర్షికతో ఆమె తన వంటలను జనానికి పరిచయం చేస్తూ వీడియోలు చేస్తుంది. అందంగా ఉంటూనే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఈమె రకరకాల టిప్స్ చెబుతోంది. అందులో భాగంగా తాజాగా ఆమె చికెన్ పుట్టు కర్రీ ఎలా ఉండాలో చూపించి దాన్ని ఉపాసనకు రుచి చూపించింది. అందులో భాగంగా రష్మిక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్‌ను బయటపెట్టింది. తమ సామాజిక వర్గంలో ఎక్కువగా పంది మాంసం తింటారని పేర్కోంది. రష్మిక ఇంకా మాట్లాడుతూ.. పంది మాంసం మా సంప్రదాయ వంటకం అని పందిని నిప్పు మీద కాల్చి తింటామని చెప్పుకొచ్చింది రష్మిక. అంతేకాదు వైన్ తో కూడా తాము చాలా చేస్తామని ఒక రకంగా వైన్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాము అని చెప్పుకొచ్చిందీ భామ. ఇంకా తమ భాషలో కోడిని మీ భాషలో కోర్నీ అంటారని తెలిపింది.

  ఇక రష్మిక మందన సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడు తెలుగులో సూపర్ ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్‌లో రష్మిక ఒకరు. తాజాగా శర్వానంద్‌ హీరోగా నటిస్తోన్న 'ఆడవాళ్లు మీకు జోహర్లు' సినిమాలో రష్మిక నటిస్తోంది. దసరా సందర్భంగా ఈ చిత్ర యూనిట్‌ తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. ఈ చిత్రంకోసం రష్మిక ఏకంగా రూ.1.20 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ సమయంలో రూ.కోటి డిమాండ్‌ చేయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు షాక్‌కు గురైనట్లు సమాచారం. ఇక రష్మిక ఆచార్యలో చరణ్ సరసన మెరవనుంది. చిరంజీవి ప్రధాన పాత్రలో శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాట్నీ ఎంటర్టైన్ మెంట్‌తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రష్మిక ప్రస్తుతం బన్ని సరసన నటిస్తోంది. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పున : ప్రారంభమైంది. ఇక మరోవైపు రష్మిక మరో సినిమాలోను అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన నటించే అవకాశం ఉందట.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Rashmika mandanna, Tollywoood

  తదుపరి వార్తలు