రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, కన్నడ ఇండస్ట్రీని తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటూ కథానాయికగా తన దూకుడు చూపిస్తోంది. కన్నడ సినిమా ‘కిరీక్ పార్టీ’ మూవీతో అరంగేట్రం చేసిన ఈ భామ.. తెలుగులో ‘ఛలో’ సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్, వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ యేడాది మహేష్ బాబుతో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో పాటు తాజాగా ‘భీష్మ’ తో మరో సక్సెస్ అందుకొని.. ప్రస్తుతం రూ. కోటి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. తాజాగా ఈ భామ తనకంటే తమిళ కమెడియన్ కమ్ హీరో వడివేలు అంటే తనకెంతో ఇష్టమని సోషల్ మీడియా వేదికగా చెప్పడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
రష్మిక మందన్న ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుకుగా ఉండే రష్మిక మందన్న.. భీష్మ చిత్ర సక్సెస్‌తో రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఐతే.. రష్మిక దిగిన ఈ ఫోటోలు వడివేలు యాక్ట్ చేసిన కొన్ని సినిమాల్లోని స్టిల్స్ మాదిరి ఉన్నాయి. దీంతో నెటిజన్లు రష్మిక ఫోటోల పక్కన వడివేలు వివిధ ఫోజుల్లో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ మీమ్స్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులు చేసిన ఈ మీమ్స్ పై రష్మిక స్పందించింది. నేను ఒప్పుకోనేదే లేదు. నా కంటే వడివేలు చాలా క్యూట్‌గా ఉన్నారు అని పేర్కొంది. ఇక సినిమాల్లో మీకు నచ్చిన స్నేహితుడు ఎవరన్న ప్రశ్నకు నితిన్ తనకు మంచి ఫ్రెండ్ అయితే బాగుండు అంది. మరోవైపు తమిళ స్టార్ నటుడు విజయ్ అంటే తనకేంతో ఇష్టమని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇక మీకు ఎలాంటి భర్త కావాలనుకుంటున్నారన్న ప్రశ్నకు తమిళ నటుడిని పెళ్లి చేసుకోవాలని కోరకుంటున్నాని చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bheeshma, Rashmika mandanna, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood