ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తన దూకుడుతో దూసుకుపోతుంది రష్మిక మందన్న. కన్నడ సినిమా ‘కిరీక్ పార్టీ’ మూవీతో అరంగేట్రం చేసిన ఈ భామ.. తెలుగులో ‘ఛలో’ సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతో మరో హిట్టును తన అకౌంట్‌లో వేసుకుంది. అంతేకాదు తెలుగులో వరుసగా ఎన్టీఆర్, అల్లు అర్జున్, సహా పలువురు అగ్ర హీరోల సినిమాల్లో కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది. తమిళంలో కూడా కార్తి హరోగా నటించే ‘సుల్తాన్’ సినిమాలో యాక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింద. ప్రస్తుతం ఈ భామ..నితిన్ సరసన ‘భీష్మ’ సినిమాలో హీరోయన్‌గా నటించింది. శివరాత్రి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా.. రష్మిక పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.
ఈ సందర్భంగా తనకు తమిళ హీరో విజయ్ అంటే క్రష్ అని చెప్పుకొచ్చింది. ఆయనతో కలిసి ‘బిగిల్’ సినిమాలో నటించమని ఆఫర్ కూడా వచ్చింది. చేతిలో వరసగా సినిమాలు ఉండటంతో ఆ సినిమాలో యాక్ట్ చేయలేకపోయాను. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bheeshma, Bollywood, Kollywood, Mahesh babu, Nithiin, Rashmika mandanna, Sarileru Neekevvaru, Tollywood, Vijay