రష్మిక చేసిన ఆ పనికి ఫుల్ డిసప్పాయింట్ అయిన ప్రొడ్యూసర్స్..

Rashmika Mandanna : ప్రేక్షకుల్లో ఒకరకమైన సస్పెన్స్ క్రియేట్ చేసి.. మంచి టైమింగ్ చూసి టైటిల్ రివీల్ చేద్దామనుకుంటే.. రష్మిక ఏంటి ఇలా చేసిందని నిర్మాతలు వాపోతున్నారట.

news18-telugu
Updated: August 20, 2019, 10:58 AM IST
రష్మిక చేసిన ఆ పనికి ఫుల్ డిసప్పాయింట్ అయిన ప్రొడ్యూసర్స్..
రష్మిక (Photo : Twitter.com/iamRashmika)
  • Share this:
సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు చాలా కామన్. సినిమా అనౌన్స్ చేయాలన్నా.. షూటింగ్ మొదలుపెట్టాలన్నా.. ప్రతీది ముహూర్తం చూసుకునే మొదలుపెడుతారు. అదో సెంటిమెంట్. అప్పటిదాకా ఆ సినిమాపై గాసిప్స్‌తో ఊరించి.. ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతారు. తమిళంలో ఎన్‌ఆర్ ప్రభు నిర్మాణంలో రష్మిక, నెపోలియన్,యోగిబాబు,మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని కూడా ఇలాగే అనౌన్స్ చేయాలనుకున్నారట. అయితే ఇంతలోనే హీరోయిన్ రష్మిక మందన్నా వారి సెంటిమెంట్‌పై నీళ్లు చల్లేసిందట. ఇప్పటివరకు టైటిల్ అనౌన్స్ చేయని ఈ సినిమా టైటిల్‌ను రష్మిక ట్విట్టర్‌లో రివీల్ చేసేయడంతో.. వారు ఆగ్రహం వ్యక్తం చేశారట.

ప్రేక్షకుల్లో ఒకరకమైన సస్పెన్స్ క్రియేట్ చేసి.. మంచి టైమింగ్ చూసి టైటిల్ రివీల్ చేద్దామనుకుంటే.. రష్మిక ఏంటి ఇలా చేసిందని నిర్మాతలు వాపోతున్నారట. నిజానికి టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలనుకున్నారట.కానీ ఈలోపే రష్మిక టైటిల్ రివీల్ చేయడంతో చిత్రయూనిట్ డిసప్పాయింట్ అయ్యారట. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటంటే.. 'సుల్తాన్'.
నాలుగు రోజుల క్రితం ఈ చిత్ర షూటింగ్ ఫోటో ఒకటి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రష్మిక.. 'సుల్తాన్ సినిమా షూటింగ్‌లో' అంటూ టైటిల్ బయటపెట్టేసింది. రష్మిక చేసిన పనికి సుల్తాన్ నిర్మాతలు నిరాశకు గురయ్యారట.First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>