• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RASHMIKA MANDANNA REJECTS NANI SHYAM SINGHA ROY OFFER SR

Rashmika Mandanna : నాని సినిమాను రిజెక్ట్ చేసిన రష్మిక మందన..

Rashmika Mandanna : నాని సినిమాను రిజెక్ట్ చేసిన రష్మిక మందన..

రష్మిక మందన, నాని Photo : Twitter

Rashmika Mandanna : వరుస బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకోవడంతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

  • Share this:
    Rashmika Mandanna : 'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన. విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇక ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. అలా అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె తాజాగా నితిన్‌తో భీష్మలో నటించి మరో హిట్‌ను అందుకుని సూపర్ ఫామ్‌లో ఉంది. ఇలా వరుస బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకోవడంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో దర్శక నిర్మాతలు వరుస ఆఫర్స్ రష్మిక మందన వద్దకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే నాని హీరోగా వస్తోన్న శ్యామ్ సింగరాయ్‌లో హీరోయిన్‌గా రష్మిక మందనకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రష్మిక మాత్రం నాని సినిమా ఆఫర్ ను తిరస్కరించినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో నాని సరసన ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట. ఒక పాత్ర కోసం ఇప్పటికే సాయి పల్లవిని ఎంచుకున్నట్లు సమాచారం. మరో హీరోయిన్ పాత్రకు రష్మిక సంప్రదించినట్లు తెలుస్తోంది.

    కానీ రష్మిక మాత్రం ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. గతంలో నాని, రష్మిక మందన కలిసి దేవదాస్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆఫర్ తిరస్కరించడానికి కారణం ఏమిటి అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక రష్మిక తెలుగులో చిరంజీవి ఆచార్యలో చరణ్ సరసన మెరవనుంది. మాట్నీ ఎంటర్టైన్ మెంట్‌తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్‌గా వస్తోన్న ఈ చిత్రం.. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ సినిమాతో పాటు రష్మిక ప్రస్తుతం బన్ని సరసన పుష్పలో నటిస్తోంది. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
    First published:

    అగ్ర కథనాలు