అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో పక్క ఇండస్ట్రీ భామలు..ఇంతకీ ఎవరో తెలుసా..

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత  ఏ సినిమా చేయాలనే దానిపై పూర్తిగా ఆలోచించి చివరగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త  సినిమాకు ఓకే చెప్పాడు.కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌‌కు అవకాశం ఉంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 7, 2019, 8:01 AM IST
అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో పక్క ఇండస్ట్రీ భామలు..ఇంతకీ ఎవరో తెలుసా..
అల్లు అర్జున్, త్రివిక్రమ్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 7, 2019, 8:01 AM IST
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత  ఏ సినిమా చేయాలనే దానిపై పూర్తిగా ఆలోచించి చివరగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త  సినిమాకు ఓకే చెప్పాడు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలనే అందుకున్నాయి. దీంతో ఈ సారి చేయబోయే సినిమాలో ఖచ్చితంగా హిట్టు కొట్టి హాట్రిక్ సక్సెస్ అందుకోవాలనే కసి మీదున్నారు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా మార్చిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ కమ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌తో పాటు కామెడీ ఎలిమెంట్స్ ఉండేటట్లు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌‌కు అవకాశం ఉంది. అందులో ఒక భామ కన్నడ భామ రష్మిక మండనను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇంకో కథానాయికగా మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి కథానాయికల ఎంపిక విషయంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్‌లు ఇప్పటికే ఓ డిసిషిన్‌కు వచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

అనుపమ పరమేశ్వరన్ ఫోటోస్ 

ఇవి కూడా చదవండి

ప్రభాస్ దర్శకత్వంలోనే అఖిల్ సినిమా.. ఫ్యాన్స్‌కు పండగే..
Loading...
ప్రేమ కావాలంటోన్న సల్మాన్ ఖాన్.. ఈ సారైనా దొరుకుతుందా..?

నాగేశ్వరావు బయోపిక్‌లో హీరోగా.. బెల్లంకొండ శ్రీనివాస్

 
First published: February 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...