హోమ్ /వార్తలు /సినిమా /

ఎయిర్ పోర్ట్‌లో రష్మిక చేసిన పనికి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. అందరి ముందే..

ఎయిర్ పోర్ట్‌లో రష్మిక చేసిన పనికి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. అందరి ముందే..

ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక మందన్న (Instagram/Photos)

ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక మందన్న (Instagram/Photos)

రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, కన్నడ ఇండస్ట్రీని తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటూ కథానాయికగా తన దూకుడు చూపిస్తోంది. తాజాగా ఈమె హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌లో అందరి ముందు చేసిన పనికి అభిమానులు అవాక్కవుతున్నారు.

రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, కన్నడ ఇండస్ట్రీని తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటూ కథానాయికగా తన దూకుడు చూపిస్తోంది. కన్నడ సినిమా ‘కిరీక్ పార్టీ’ మూవీతో అరంగేట్రం చేసిన ఈ భామ.. తెలుగులో ‘ఛలో’ సినిమాతో పరిచయం అయింది.  ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్, వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  ఈ యేడాది మహేష్ బాబుతో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో పాటు తాజాగా ‘భీష్మ’ తో మరో  సక్సెస్ అందుకొని.. ప్రస్తుతం రూ. కోటి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ.. తన సినిమాల కోసం షూటింగ్‌ల కంటే ఎయిర్ పోర్ట్‌లోనే ఎక్కువగా గడుపుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోన్న రష్మిక.. తాజాగా హైదరాబాద్‌ ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చింది. ఎయిర్ పోర్ట్‌లో కనిపించడం పెద్ద తప్పు కాకపోయినా.. అక్కడ ఈమె చేసిన ఓవర్ యాక్షన్ చూసి అక్కడున్న జనాలు అవాక్కయ్యారు.


వరసగా రెండు సక్సెస్‌ఫుల్ సినిమాలు రావడంతో ఆమె ఎయిర్ పోర్ట్‌లో ఫోటో గ్రాఫర్స్‌కు ఫోజులిస్తూ కనిపించింది. రష్మిక చేసిన ఓవరాక్షన్‌ను ఓ నెటిజన్ నెటింట్లో పోస్ట్ చేసాడు. వరుసగా రెండు సక్సెస్‌లు వచ్చినంత మాత్రానా ఇంత ఓవరాక్షన్ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు యాక్టింగ్ ఓరియండెట్‌గా ఉన్న రష్మిక.. ఈ సినిమాలో మాత్రం ఓవరాక్షన్ చేసిందనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఈ కామెంట్స్ పై రష్మిక మాట్లాడుతూ.. నటిగా దర్శకుడు చెప్పినట్టు నటించడం తన బాధ్యత. ఓ నటిగా పాత్రకు తగినట్లుగా నటించడం తన వృత్తి అంటూ కాస్త తెలివిగానే సమాధానమిచ్చింది.

First published:

Tags: Bheeshma, Mahesh babu, Rashmika mandanna, Sarileru Neekevvaru, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు