ఆ సీన్స్ చేయడం నా వల్ల కాదు.. అందుకే వదులుకున్న : రష్మిక మందన..

Rashmika Mandanna : నితిన్‌తో భీష్మలో నటించి తాజాగా మరో హిట్‌ను అందుకున్న రష్మిక ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది.

news18-telugu
Updated: June 25, 2020, 2:25 PM IST
ఆ సీన్స్ చేయడం నా వల్ల కాదు.. అందుకే వదులుకున్న : రష్మిక మందన..
Instagram
  • Share this:
Rashmika Mandanna : 'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన రష్మిక మందన.. 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. ఆమె తాజాగా నితిన్‌తో భీష్మలో నటించి మరో హిట్‌ను అందుకుని సూపర్ ఫామ్‌లో ఉంది. అది అలా ఉంటే నాని హీరోగా తెలుగులో తెరకెక్కిన 'జెర్సీ' మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ గా రష్మికను తీసుకోవాలని దర్శకనిర్మాతలు అనుకున్నారట. కానీ ఈ ఆఫర్ రష్మిక తిరస్కరించిందని. అంతేకాదు ఈ చిత్రం కోసం రష్మిక భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా రష్మిక స్పందిస్తూ.. తాను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదని చెప్పింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర లోతైన ఎమోషన్స్ ని కలిగి ఉంటుందని... ఆ స్థాయి పాత్రను తాను చేయలేనని తెలిపింది. దీనికి తోడు మరోవైపు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం కూడా మరో కారణమని అందుకే ఆ సినిమాను వదులుకున్నానని తెలిపింది. ఇక రష్మిక తెలుగులో ఆచార్యలో చరణ్ సరసన మెరవనుంది. చిరంజీవి ప్రధాన పాత్రలో శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాట్నీ ఎంటర్టైన్ మెంట్‌తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్‌గా వస్తోన్న ఈ చిత్రం.. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ సినిమాతో పాటు రష్మిక ప్రస్తుతం బన్ని సరసన పుష్పలో నటిస్తోంది. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
First published: June 25, 2020, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading