news18-telugu
Updated: October 19, 2019, 2:53 PM IST
రష్మిక మందన్న Instagram/rashmika_mandanna
రష్మిక మందన్న హిందీలో వచ్చిన క్రేజీ ఆఫర్‌ను ఒదులుకుంది. ఈ యేడాది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. రీసెంట్గా అర్జున్ రెడ్డి సినిమా హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో హీరోగా నటించిన షాహిద్ కపూర్ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇపుడు అదే ఊపులో తెలుగులో హిట్టైయిన ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటించడానికి ఓకే చెప్పాడు. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. హిందీలో ఈ సినిమాను అల్లు అరవింద్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

జెర్సీ రీమేక్‌లో షాహిద్ కపూర్
ఇక హిందీలో షాహిద్ కపూర్ సరసన రష్మిక మందన్నను ఎంపిక చేసారు. కానీ రష్మిక మందన్న ఇప్పటికే చేతిలో ఉన్న సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా హిందీ రీమేక్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఇపుడు హిందీ రీమేక్‌లో మృణాల్ ఠాగూర్ నటించబోతున్నట్టు సమాచారం.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 19, 2019, 2:53 PM IST