HOME » NEWS » movies » RASHMIKA MANDANNA IS THE NATIONAL CRUSH OF INDIA 2020 SR

Rashmika Mandanna : రష్మిక మందనకు అరుదైన గుర్తింపునిచ్చిన గూగుల్ ఇండియా..

Rashmika Mandanna : వెంకీ కుడుముల 'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన రష్మిక మందన.. విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది.

news18-telugu
Updated: November 20, 2020, 12:20 PM IST
Rashmika Mandanna : రష్మిక మందనకు అరుదైన గుర్తింపునిచ్చిన గూగుల్ ఇండియా..
రష్మిక మందన (Instagram/Photo)
  • Share this:
Rashmika National Crush: వెంకీ కుడుముల 'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన రష్మిక మందన.. విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇక పోయిన సంక్రాంతికి మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. ఆమె ఇటీవల నితిన్‌తో భీష్మలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అది అలా ఉంటే రష్మిక మందన ఓ రేర్ ఫీట్‌ను సాధించింది. తన అందచందాలతో కుర్రకారు మనసులను దోచుకున్న నటి రష్మిక మందనకు గూగుల్ మరపురాని గుర్తింపును ఇచ్చింది. గూగూల్ 2020 సంవత్సరానికి గాను 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా రష్మిక ఎన్నికైనట్టు ప్రకటించింది. గూగుల్ లో ఈ సెర్చ్ వర్డ్స్ టైప్ చేస్తే, రష్మిక గురించిన సమాచారం కనిపిస్తోంది. గూగుల్ లో ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా 2020’ ను సెర్చ్ చేస్తే రష్మిక మందన్నని మాత్రమే చూపిస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి కారణం కూడా ఉందట. రష్మిక డ్రెస్సింగ్ స్టైల్ నచ్చడం వల్లే ఆమెని నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా నేషనల్ వైడ్ గా గుర్తించారట. ఇక ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమంటే.. జాతీయ స్థాయిలో అంటే తెలుగు, కన్నడ భాషల్లో తప్ప రష్మిక మరే ఇతర భాషల్లో నేరుగా సినిమాలు చేయలేదు. కానీ ఆమె నటించిన డియర్ కామ్రెడ్, భీష్మ, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఇటు తమిళ, హిందీ భాషాల్లో డబ్ చేశారు. ఇది కూడా ఆమె క్రేజ్ కారణం అని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ ఘనతని దిశా పటానీ, ప్రియా ప్రకాష్ వారియర్, మానుషి చిల్లర్ సాధించారు.

Rashmika Mandanna news, Rashmika house in hyderabad,rashmika mandanna dance,rashmika mandanna cars,rashmika mandanna,rashmika,rashmika mandanna hot,rashmika mandanna songs,rashmika mandanna kiss,rashmika hot,rashmika mandanna photos,rashmika mandanna movies,rashmika mandanna lifestyle,rashmika madanna,rashmika mandanna hot photo shoot,rashmika mandanna whatsapp status,rashmika hot in chalo,rashmika mandanna hot kiss,rashmika mandanna hot navel,rashmika mandanna hot songs,rashmika mandanna hot dance,రష్మిక మందన్న,రష్మిక మందన్న హాట్,రష్మిక మందన్న హాట్ ఫోటోస్
రష్మిక మందన Photo : Twitter


ఇక రష్మిక మందన సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడు తెలుగులో సూపర్ ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్‌లో రష్మిక ఒకరు. తాజాగా శర్వానంద్‌ హీరోగా నటిస్తోన్న 'ఆడవాళ్లు మీకు జోహర్లు' సినిమాలో రష్మిక నటిస్తోంది. దసరా సందర్భంగా ఈ చిత్ర యూనిట్‌ తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. ఈ చిత్రంకోసం రష్మిక ఏకంగా రూ.1.20 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ సమయంలో రూ.కోటి డిమాండ్‌ చేయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు షాక్‌కు గురైనట్లు సమాచారం. ఇక రష్మిక ఆచార్యలో చరణ్ సరసన మెరవనుంది. చిరంజీవి ప్రధాన పాత్రలో శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాట్నీ ఎంటర్టైన్ మెంట్‌తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రష్మిక ప్రస్తుతం బన్ని సరసన నటిస్తోంది. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పున : ప్రారంభమైంది. ఇక మరోవైపు రష్మిక మరో సినిమాలోను అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన నటించే అవకాశం ఉందట.
Published by: Suresh Rachamalla
First published: November 20, 2020, 12:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading