• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RASHMIKA MANDANNA IS NOT INTERESTED TO WORK WITH YOUNG HEROES REJECTS NANI FILM SR

ఆ హీరోలకు నో ఛాన్స్ అంటోన్న రష్మిక మందన.. కారణం అదేనా..

ఆ హీరోలకు నో ఛాన్స్ అంటోన్న రష్మిక మందన.. కారణం అదేనా..

రష్మిక మందన Photo : Twitter

Rashmika Mandanna : వరుస హిట్ సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక తాజాగా నితిన్‌తో భీష్మలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది.

  • Share this:
    Rashmika Mandanna :  వెంకీ కుడుముల 'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది రష్మిక మందన. ఇక ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. ఆమె తాజాగా నితిన్‌తో భీష్మలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది.దీంతో తెలుగులో మాంచి క్రేజ్ వచ్చింది రష్మిక మందనకు. దీంతో ఇప్పుడు తెలుగులో సూపర్ ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్‌లో రష్మిక ఒకరు. దీన్నే ఇప్పుడు ఈ భామ క్యాష్ చేసుకోవాలనీ చూస్తోంది. ఈ భామ కాదు.. కాస్తా క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌కు కొంచెం ఫాలోయింగ్ పెరిగితే చాలు.. రెమ్యూనరేషన్ అమాంతం పెంచుతారు. దానికితోడు వరుస హిట్స్ వస్తే మాత్రం ఆ హీరోయిన్ ఆర్డర్స్ కి అడ్డుఅదుపు ఉండదు. ఇప్పుడు అలాంటీ కోవలోకే వస్తోంది రష్మిక. ఏ మాత్రం తన కండిషన్స్ కు అడ్డు చెబితే ఇక ఆ సినిమా చేయను అని చెప్పేస్తోందట ఈ భామ. అంతేకాదు స్టార్స్ పక్కన తప్ప యంగ్ హీరోలతో ఇక సినిమాలు చేయనని చెప్పేస్తోందట.

    అంతేకాదు స్టార్ డమ్ లేని హీరోల ప్రాజెక్ట్ లు తన దగ్గరకు తీసుకురావద్దని తన మేనేజర్ కు చెప్పేసిందట. అంతేగా మరి తన టైమ్ వచ్చినప్పుడే చూపించుకోవాలి. తాజగా ఈ భామకు నటుడు నాని సరసన నటించే అవకాశం వచ్చిందట. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌ నానితో శ్యామ్ సింగరాయ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే మరో హీరోయిన్‌గా సాయి పల్లవి ఓకే అవ్వగా మరో హీరోయిన్ పాత్ర కోసం రష్మికను సంప్రదించిందట చిత్రబృందం. అయితే రష్మక మాత్రం సున్నితంగా తాను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నానంటూ ఈ సినిమా ఆఫర్ సున్నితంగా తిరస్కరించిందట. ఇక రష్మిక ఆచార్యలో చరణ్ సరసన మెరవనుంది. చిరంజీవి ప్రధాన పాత్రలో శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాట్నీ ఎంటర్టైన్ మెంట్‌తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్‌గా వస్తోన్న ఈ చిత్రం.. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ సినిమాతో పాటు రష్మిక ప్రస్తుతం బన్ని సరసన నటిస్తోంది. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
    First published:

    అగ్ర కథనాలు