Rashmika Mandanna: టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. అంతేకాకుండా మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్ గా కూడా స్థానాన్ని సంపాదించుకుంది. పైగా ఇండియన్ క్రష్ గా అభిమానుల హృదయాలలో నిలిచింది. నిజానికి ఈ బ్యూటీ కాజల్ అగర్వాల్, కియారా అద్వానీ, సమంత లకు పోటీగా దిగిందనే చెప్పవచ్చు.
కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది రష్మిక. ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టా లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
తన ఇన్ స్టా లో ఏకంగా 19.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు రెండు కోట్ల మంది అభిమానులతో టాప్ లిస్టులో చేరింది రష్మిక. ఇప్పటి వరకు కాజల్ అగర్వాల్ ఆ రేంజ్ లో ఉండగా తనకు 19 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అంతేకాకుండా కియారా కు 17.7, సమంతకు 17.5 మిలియన్ ల ఫాలోవర్స్ ఉండగా వీరిని మించి దాటిపోయింది రష్మిక మందన. మొత్తానికి అటు వెండి తెరపై, ఇటు సోషల్ మీడియా పై గట్టి పరిచయాన్ని పెంచుకుంది ఈ కన్నడ బ్యూటీ.
View this post on Instagram
ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉంది. బాలీవుడ్ లో గుడ్ బై, మిషన్ మజ్ను మూవీ లో నటిస్తుంది. అంతేకాకుండా పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది రష్మిక. ఇటీవలే తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమాలో మంచి సక్సెస్ అందుకుంది. ఇక టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తో మరోసారి జత కటనున్నట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Instagram, Kajal Aggarwal, Rashmika mandanna, Samantha akkineni, Tollywood