Rashmika Mandanna: కన్నడ కస్తూరి రష్మిక మందన్నకు తెలుగులో మంచి ఫాలోయింది. తొందర్లనే ఈ శాండిల్ వుడ్ బేబి.. బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం తెలుగులో అగ్ర హీరోల ఫేవరేట్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి రష్మికకు తాజాగా అనుకోని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. వెంకీ కుడుముల 'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన రష్మిక మందన.. విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఆ తర్వాత నాగార్జున, నానిల ’దేవదాసు’లో నటించింది. ఇక పోయిన సంక్రాంతికి మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నితిన్‌తో చేసిన ‘భీష్మ’ సినిమా కూడా సూపర్ హిట్టైంది.
తన అందచందాలతో కుర్రకారు మనసులను దోచుకున్న నటి రష్మిక మందనకు గూగుల్ మరపురాని గుర్తింపును ఇచ్చింది. గూగూల్ గతేడాదిగాను 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా రష్మిక ఎన్నికైంది.ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమంటే.. జాతీయ స్థాయిలో అంటే తెలుగు, కన్నడ భాషల్లో తప్ప రష్మిక మరే ఇతర భాషల్లో నేరుగా సినిమాలు చేయలేదు. కానీ ఆమె నటించిన డియర్ కామ్రెడ్, భీష్మ, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఇటు తమిళ, హిందీ భాషాల్లో డబ్ చేశారు. ఇది కూడా ఆమె క్రేజ్ కారణం అని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ ఘనతని దిశా పటానీ, ప్రియా ప్రకాష్ వారియర్, మానుషి చిల్లర్ సాధించారు.
రష్మిక విషయానికొసక్తే.. ప్రస్తుతం ఈమె చేతిలో అల్లు అర్జున్,.. ‘పుష్ప’ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.అటు శర్వానంద్ సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది. దాంతో పాటు పలు కన్నడ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో బీ టౌన్‌లో కూడా సత్తా చూపెట్టాలని చూస్తోంది. తాజాగా ఈ భామకు అనుకోని షాక్ తగిలింది. అది కూడా గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నుంచి. ఎలా అని ఆశ్యర్యపోతున్నారా.. రీసెంట్‌గా రష్మిక మందన్నకు సూర్య సరసన ఓ సినిమాలో బంపరాఫర్ వచ్చింది. తీరా షూటింగ్ మొదలయ్యే టైమ్‌కు రష్మిక ప్లేస్లో ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకున్నారు.
సడెన్‌గా ఎంతో క్రేజ్ ఉన్న రష్మికను ఈ సినిమా నుంచి తప్పించడానికి పెద్ద రీజనే ఉందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం రష్మిక డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. ఆమె చెప్పిన పారితోషకం ఎక్కువగా ఉండటంతో వెంటనే రష్మికను తప్పించిన ఆమె ప్లేస్‌లో ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకున్నారు. మొత్తంగా పూజా హెగ్డేతో సమానంగా తెలుగులో అవకాశాలు కొల్లగొడుతున్న రష్మికకు ఇపుడు ఓ అప్ కమింగ్ హీరోయిన్ షాకివ్వడాన్ని కోలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 4 Telugu, Bollywood news, Kollywood, Rashmika mandanna, Sandalwood, Tollywood