విజయ్‌ దేవరకొండతో డేటింగ్‌‌పై స్పష్టతనిచ్చిన రష్మిక మందన

Rashmika Mandanna : డియర్ కామ్రేడ్ చిత్రం మొదలైన దగ్గరి నుంచి విజయ్‌, రష్మిక డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేశాయి... చేస్తున్నాయి. దీంతో అసలు వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలుసుకోవాలని ఫ్యాన్స్‌ కూడా ఆసక్తి చూపుతున్నారు. తాజగా ఈ విషయంపై రష్మిక స్పందించింది.

news18-telugu
Updated: August 17, 2019, 5:26 PM IST
విజయ్‌ దేవరకొండతో డేటింగ్‌‌పై స్పష్టతనిచ్చిన రష్మిక మందన
Photo : Twitter.com/iamRashmika
  • Share this:
Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా ఇటీవల డియర్ కామ్రేడ్  విడుదలైన సంగతి తెలిసిందే. ఈ జంట ఇంతకు ముందు ‘గీత గోవిందం’ ‌లో కూడా  అదరగొట్టారు. అది అలా ఉంటే డియర్ కామ్రేడ్ చిత్రం మొదలైన దగ్గరి నుంచి విజయ్‌, రష్మిక డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేశాయి... చేస్తున్నాయి. దీంతో అసలు వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలుసుకోవాలని వీరి ఫ్యాన్స్‌ కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌తో తన కున్న రిలేషన్ షిప్ గురించి తాజాగా రష్మిక స్పందించారు. 

View this post on Instagram
 

💛


A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

మీరు విజయ్‌తో డేటింగ్‌లో ఉన్నారా? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ఆమె రిప్లై ఇస్తూ.. ‘అతడు నాకు కేవలం స్నేహితుడు మాత్రమే.. దానికి మించి ఏమీలేదు’ అని స్పష్టం చేసింది. అది అలా ఉంటే రష్మిక, విజయ్‌ల 'డియర్ కామ్రేడ్' భారీ అంచనాలతో విడుదలై.. అనుకున్నంతగా అలరించలేకపోయింది. 'డియర్ కామ్రేడ్‌'ను భరత్ కమ్మ డైరెక్ట్ చేయగా.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక ప్రస్తుతం మహేష్ హీరోగా  ఆర్మీ ఆఫీసర్ పాత్రలో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’లో  హీరోయిన్‌గా చేస్తోంది.  ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అటూ విజయ్ కూడా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడని ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన చార్మీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు