RASHMIKA MANDANNA FIRST BOLLYWOOD MOVIE WITH SIDHARTH MALHOTRA MISSION MAJNU REGULAR SHOOTING STARTS TODAY TA
Rashmika: బాలీవుడ్లో రష్మిక మిషన్ స్టార్ట్.. హిందీ సినిమా షూట్లో పాల్గొన్న శాండిల్ వుడ్ బ్యూటీ..
బాలీవుడ్ సినిమా షూటింగ్లో పాల్గొన్న రష్మిక మందన్న (Twitter/Photo)
Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టు ముందుగా తెలుగు ఇండస్ట్రీలో సత్తా చూపెట్టిన ఈ భామ.. ఇపుడు బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది.
Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టు ముందుగా తెలుగు ఇండస్ట్రీలో సత్తా చూపెట్టిన ఈ భామ.. ఇపుడు బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే రష్మిక మందన్న.. బాలీవుడ్లో సిద్దార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమా నటిస్తున్నట్టు ప్రకటించారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లక్నోలో ప్రారంభమైంది. ఈ సినిమాను శంతను బాగ్చీ డైరెక్ట్ చేస్తున్నారు. రోనీ స్క్రూ వాలా, అమర్ బుటాల, గరిమ మెహత నిర్మిస్తున్నారు. ’మిస్టర్ మజ్ను’ సినిమాతో బీ టౌన్లో కూడా సత్తా చూపెట్టాలని చూస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. రష్మిక మందన్న ఈ రోజు షూటింగ్లో పాల్గొంది. 1970లో జరిగిన ఒక నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్లో రష్మిక మందన్న సత్తా చూపెట్టడం ఖాయం అంటున్నారు.
రష్మిక మందన్న బాలీవుడ్లో అడుగుపెట్టక ముందే .. .. ‘టాప్ టక్కర్’ అనే ఆల్బమ్‌తో సందడి చేసింది. ఇప్పటికే విడుదలైన టాప్ టక్కర్ పాట యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో దూసుకపోతుంది. ఈ పాటలో రష్మిక మందన్న అందాలకు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఫిదా అయ్యారు.
ఈ పాటను ఉచానా అమిత్ బాద్షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ పాడారు. ఈ పాటను ఉచానా అమిత్ బాద్షానే రాయడం విశేషం. ఈ పాటలో రష్మిక మందన్న తలపై సిక్కు పాగాతో కొత్త అవతారంలో కేక పుట్టిస్తోంది. మరోవైపు రష్మిక బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ సినిమాతో పాటు యశ్ రాజ్ ప్రాజెక్ట్‌కు వరుసగా సినిమాలు సైన్ చేసినట్టు సమాచారం. ఇక ఈమె నటించిన ‘టాప్ టక్కర్’ ప్రైవేట్ ఆల్బమ్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ వాళ్లు నిర్మించారు. ఇ తెలుగులో రష్మిక మందన్న అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో చేస్తోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి.. రష్మిక తొలిసారి బీటౌన్‌లో కనబడబోయే ప్రాజెక్ట్ ఇదే అవుతోంది. మొత్తంగా శాండిల్ వుడ్,టాలీవుడ్, కోలీవుడ్, అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో దూకుడు చూపెడుతున్న రష్మిక.. బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.