బంపర్ ఆఫర్‌ను‌ మిస్ చేసుకున్న రష్మిక మందన.. బాధలో ఫ్యాన్స్..

Rashmika Mandanna : రష్మిక మందన.. 'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది.

news18-telugu
Updated: May 3, 2020, 3:40 PM IST
బంపర్ ఆఫర్‌ను‌ మిస్ చేసుకున్న రష్మిక మందన.. బాధలో ఫ్యాన్స్..
రష్మిక మందన Photo : Instagram
  • Share this:
Rashmika Mandanna : రష్మిక మందన.. 'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. ఆమె తాజాగా నితిన్‌తో భీష్మలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అది అలా ఉంటే నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ సినిమా హిందీలో భారీ స్థాయిలోనే రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట రష్మిక మందనను అనుకుంది చిత్రబృందం. అందులో భాగంగా ఆమెను సంప్రదిస్తే.. ఆ ఆఫర్‌ను రష్మిక తిరస్కరించింది. అయితే షాహిద్ కపూర్ లాంటి స్టార్ సరసన బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఉంటే రష్మిక కెరీర్ ఇక ఓ రేంజ్‌లో ఉండేదని అది ఆమెకు ఎంతో ఉపయోగపడేదని అంత మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు ఆమె అభిమానులు బాగా బాధ పడుతున్నారట. ఆ బాలీవుడ్ ఆఫర్‌ను అంగీకరిస్తే హిందీలో కూడా బిజీ అయ్యేది అని.. అలాంటీ బంగారంలాంటీ అవకాశాన్ని రష్మిక మిస్ చేసుకుందని తెగ ఫీల్ అవుతున్నారట ఆమె ఫ్యాన్స్.

ఇక రష్మిక ఆచార్యలో చరణ్ సరసన మెరవనుంది. చిరంజీవి ప్రధాన పాత్రలో శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాట్నీ ఎంటర్టైన్ మెంట్‌తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్‌గా వస్తోన్న ఈ చిత్రం.. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ సినిమాతో పాటు రష్మిక ప్రస్తుతం బన్ని సరసన నటిస్తోంది. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
Published by: Suresh Rachamalla
First published: May 3, 2020, 3:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading