రష్మిక ఇంటిపై ఐటీ దాడుల్లో కొత్త ట్విస్ట్... వాటికి ఆధారాలు లేవట..

తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందనకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: January 18, 2020, 1:16 PM IST
రష్మిక ఇంటిపై ఐటీ దాడుల్లో కొత్త ట్విస్ట్... వాటికి ఆధారాలు లేవట..
Instagram
  • Share this:
తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందనకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చిన సంగతి తెలసిందే. ఆమె సొంతూరు కర్ణాటకలోని కూర్గ్‌లో ఉన్న ఇంట్లో సంక్రాంతి పండుగ రోజు ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. అందులో భాగంగా రష్మిక నివాసం నుంచి ఐటీ అధికారులు రూ.25 లక్షల విలువజేసే ఆస్తి పత్రాలు, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్‌పేటలోగల ఆమె నివాసంలో అధికారులు తనిఖీలు చేసారు. రష్మిక ఇంట్లో ఉదయం 7.30 గంటల ప్రాంతంల అధికారులు ఈ తనిఖీలను నిర్వహించారు. ఈ క్రమంలో లెక్క తేలని మొత్తం రూ.25 లక్షలు విలువజేసే ఆస్తి పత్రాలు, నగదును ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారణం ఈ స్వాధీనం చేసుకున్న మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను రష్మిక తండ్రి అధికారులకు చూపించలేకపోయారు. దీంతో దాదాపు రూ.25 లక్షల విలువజేసే ఆస్తి పత్రాలు, డబ్బును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అది అలా ఉంటే రష్మిక ప్రస్తుతం సూపర్ బిజీగా గడుపుతోంది. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రష్మిక... అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాతో పాటు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసింది.
మేకప్ లేకుండా అంజలి ఎలా ఉంటుందో తెలుసా..
Published by: Suresh Rachamalla
First published: January 18, 2020, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading