Rashmika: వామ్మో రష్మిక మందన్న కోరిక తెలిస్తే.. దిమ్మ దిరగడం ఖాయం..

మన దేశంలో సినిమా హీరోయిన్స్‌కు ఉన్న క్రేజ్ గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా రష్మిక కూడా అభిమానులు తనకు ఓ పని చేసి పెట్టాలంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతోంది.

news18-telugu
Updated: August 6, 2019, 4:43 PM IST
Rashmika: వామ్మో రష్మిక మందన్న కోరిక తెలిస్తే.. దిమ్మ దిరగడం ఖాయం..
రష్మిక మందన్నా (File Photo)
news18-telugu
Updated: August 6, 2019, 4:43 PM IST
మన దేశంలో సినిమా హీరోయిన్స్‌కు ఉన్న క్రేజ్ గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.తమిళనాడు ప్రాంతాల్లో అయితే.. వాళ్లు కథానాయిక నచ్చితే చాలు ఏకంగా గుడి కట్టేస్తుంటారు. వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా. ఇలా అభిమానులు.. హీరోయిన్స్‌ను ఒక్కొక్కరూ ఒక్కోలా అభిమానిస్తారు, కొందరు తమ అభిమాన నటీనటుల కోసం ట్రస్ట్ లను ఏర్పాటు చేస్తారు. అన్నదానం, వస్త్ర దానం, రక్తదానం ఇలా వారు చేయని సేవ అంటూ ఏమీ ఉండదు.అయితే తమ తమ అభిమాన నటీనటులను దేవుడి సమానంగా చూడటం తమిళ ప్రేక్షకులకు అలవాటు. ఈ నేపథ్యంలోనే గుడి కట్టడం అనేది తమిళనాట ఖుష్బూతో మొదలైంది. ఆ తర్వాత హన్సిక, నమిత వంటి వారి విషయంలో కూడా తమిళ అభిమానులు ఇలాగే చేశారు. ఒక్కసారి తమిళ అభిమానులకు ఎవరినైనా నచ్చారంటే వారి అభిమానానికి ఆకాషామే హద్దుగా సాగుతోంది.  అలాంటి అభిమానం నాకు కావాలని ఆరాట పెడుతోందట రష్మిక.

రష్మిక మందన్న Photo: Instagram.com/rashmika_mandanna


ఇటీవలే ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో  ప్రేక్షకుల ముందుకొచ్చిన రష్మిక మందన్న ప్రస్తుతం మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగునాట ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది రష్మిక మందన్న.ఖుష్భూకి గుడి కట్టినట్లే, అభిమానులు నాకు కూడా గుడి కడితే బాగుండు అని స్నేహితుల వద్ద తన కోరిక వెల్లడించిదట రష్మిక. సోషల్ మీడియా లో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ కావడంతో కొందరు రష్మిక తన పై అభిమానం ఉండాలని కోరుకోవడం, స్టార్ హీరోయిన్ కావాలని కలలు కనడం వరకూ ఓకే గానీ ఇలా గుడి కట్టించుకోవాలని ఆరాట పడటం అంటే అది ఖచ్చితంగా రష్మిక అత్యాశే అంటున్నారు.ఏమైనా కొత్తగా సౌత్‌ను దున్నేస్తున్న ఈ భామ కోరిక విని అవాక్కవుతున్నారు అభిమానులు.

First published: August 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...