RASHMIKA MANDANNA EX BOY FRIEND RAKSHIT SHETTY MARRIAGE NEWS VIRAL ON SOCIAL MEDIA SB
Rashmika: రష్మిక మాజీ ప్రియుడి పెళ్లి.. ఆ హీరోయిన్ ఎవరంటే ?
Rashmika Instagram
కిర్రాక్ పార్టీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన రష్మిక అదే సినిమాలో తన సరసన నటించిన హీరో రక్షిత్ శెట్టిని ప్రేమలో పడింది. ఇక ఆ హీరోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది.
రష్మిక మందన్నా(Rashmika Mandanna).. టాలీవుడ్ ఎంట్రీతో.. ఈ భామ ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారింది. ఒకప్పుడు కన్నడ హీరోయిన్ అయిన ఇప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్(Tollywood) స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే రష్మిక గతంలో పెళ్లి ఫిక్స్ అయి ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది. ఆ తర్వాత బ్రేకప్ కూడా అయిపోయింది. కన్నడలో ‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ అదే సినిమాలో తన సరసన నటించిన హీరో రక్షిత్ శెట్టిని(Rakshit Shetty) ప్రేమించి పెళ్లి పీటలు కూడా ఎక్కడానికి రెడీ అయింది. అయితే గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో రష్మిక నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ తో మితిమీరిన ముద్దు సన్నివేశాల వలన రక్షిత్ శెట్టి తో వివాహం క్యాన్సిల్ అయ్యింది. అంగరంగ వైభవంగా ఎంగేజ్ మెంట్ జరుపుకున్న ఈ జంట తాము పెళ్లి కాకుండానే విడిపోతున్నట్లు ప్రకటించారు.
ఇక విడిపోయాక కూడా ఈ జంట స్నేహితులుగానే కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే రక్షిత్ నటించిన ‘చార్లీ’ తెలుగులో కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక తాజాగా ఈ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కన్నడ ఇండస్ట్రీలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ‘ఉలిదవవరు కందంటే’ చిత్రంలో హీరోయిన్ గ నటించిన రమ్య ను రక్షిత్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ పుకార్లు మొదలయ్యాయి. ఇక ఈ వార్తపై రక్షిత్ స్నేహితుడు, నటుడు రిషబ్ శెట్టి స్పందించాడు.. “మావాడికి సాండల్‌వుడ్ గోల్డెన్ గర్ల్‌తో పెళ్లా? అని ఫక్కున నవ్వేశాడు. అంతేకాకుండా ఆమెపై రక్షిత్ కే కాదు మాకు క్రష్ ఉంది. కాలేజ్ రోజుల నుంచి ఆమెను మేము ఎంతో ఆరాధించేవాళ్ళం.. ‘ఉలిదవవరు కందంటే’ చుసిన రక్షిత్ ఆమె నటన ఎంతో బావుందని మెచ్చుకున్నాడు. అంతే తప్ప పెళ్లి లేదు, ఏమి లేదు.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఏవేవో ఊహించేసుకొని రాసేసే ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రక్షిత్ పెళ్లి వార్తలకు చెక్ పడింది.
ఇటు టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక అదే సమయంలో తెలుగులో ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. పుష్ప సినిమాతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. ఇక పుష్ప 2లో కూడా రష్మికనే హీరోయిన్ అని తెలుస్తోంది
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.