పూజా హెగ్డేకు రష్మిక మందన్న చెక్.. భీష్మతో పెరిగిన రేంజ్..

Rashmika Mandanna: ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్లు అంటే తమన్నా, సమంత, రకుల్, అనుష్క ఇలా చాలా పేర్లు చెప్పే వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్లంతా ఓల్డ్ అయిపోయారు. టాలీవుడ్‌లో పూజాహెగ్డే, రష్మిక మందన్న మధ్య యుద్ధం నడుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 22, 2020, 3:57 PM IST
పూజా హెగ్డేకు రష్మిక మందన్న చెక్.. భీష్మతో పెరిగిన రేంజ్..
పూజా హెగ్డే, రష్మిక మందన్న (Pooja Hegde Rashmika Mandanna)
  • Share this:
టాలీవుడ్‌లో ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ల మధ్య చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఏ సినిమా చూసినా అయితే ఆమె.. లేదంటే ఈమె అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయినా కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు పోవాల్సిందే. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్లు అంటే తమన్నా, సమంత, రకుల్, అనుష్క ఇలా చాలా పేర్లు చెప్పే వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్లంతా ఓల్డ్ అయిపోయారు. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్నపుడు కచ్చితంగా వాళ్లంతా సైడ్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా టాలీవుడ్‌లో కేవలం ఇద్దరు హీరోయిన్ల మధ్య మాత్రమే అగ్రస్థానం కోసం యుద్ధం జరుగుతుంది. వాళ్లే పూజాహెగ్డే, రష్మిక మందన్న. ఇప్పటికే పూజా స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ టాప్ పొజిషన్‌కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమెకు వరస విజయాలతో చెక్ పెడుతుంది రష్మిక.

పూజా హెగ్డే, రష్మిక మందన్న (Pooja Hegde Rashmika Mandanna)
పూజా హెగ్డే, రష్మిక మందన్న (Pooja Hegde Rashmika Mandanna)


పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ సినిమాలున్నాయి. ఈ మధ్యే బన్నీతో నటించిన అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ కావడంతో అమ్మడి రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక దాంతో పాటే అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ సినిమాలో వస్తున్న ఓ డియర్ సినిమాలో కూడా ఈమె విభిన్నమైన పాత్రలో నటిస్తుంది. మరోవైపు రష్మిక మందన్న కూడా వరస సినిమాలు చేస్తుంది. ఈ మధ్యే మహేష్ బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరుతో కమర్షియల్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో డాన్సులు కూడా కుమ్మేసింది ఈ భామ.

భీష్మ సినిమా పోస్టర్ (bheeshma movie)
భీష్మ సినిమా పోస్టర్ (bheeshma movie)
ఇప్పుడు నితిన్ భీష్మ సినిమా కూడా విజయం సాధించడంతో రష్మిక రేంజ్ మరింతగా పెరిగిపోయింది. అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో రష్మిక హీరోయిన్. ఇది హిట్టైతే రష్మిక రేంజ్ మరింతగా పెరిగిపోవడం ఖాయం. పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ చేయడంతో వరస సినిమాలు అందుకుంటుంది రష్మిక. ఇంకో విజయం కానీ వచ్చిందంటే టాలీవుడ్ నెంబర్ వన్ అయిపోతుంది ఈ కన్నడ కస్తూరి. పూజా, రష్మిక జోరుకు అడ్డుకట్ట వేయడంలో మిగిలిన హీరోయిన్లు విఫలమవుతున్నారు. రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్లు సినిమాలు చేస్తున్నారు కానీ ఒకప్పటిలా దూకుడు చూపించలేకపోతున్నారు. ఇప్పుడు గాని రష్మిక మందన్నకు మరో రెండు హిట్లు పడితే పూజా కూడా సెకండ్ ప్లేస్‌కు పడిపోవడం ఖాయం. మరి చూడాలిక.. రష్మిక జోరు ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో..?
First published: February 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు