ఐటీ అధికారుల ముందు హాజరైన రష్మిక మందన..

తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందనకు ఐటీ అధికారులు షాక్ మీద షాక్ ఇస్తున్నారు.

news18-telugu
Updated: January 21, 2020, 3:20 PM IST
ఐటీ అధికారుల ముందు హాజరైన రష్మిక మందన..
Instagram
  • Share this:
తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందనకు ఐటీ అధికారులు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. రష్మిక సొంతూరు కర్ణాటకలోని కూర్గ్‌లో ఉన్న తన ఇంట్లో సంక్రాంతి పండుగ రోజు ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో రష్మిక నివాసం నుంచి ఐటీ అధికారులు రూ.25 లక్షల క్యాష్, వివిధ ఆస్తులకు సంబందించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న ఆ మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను రష్మిక తండ్రి ఐటీ అధికారులకు చూపించలేకపోయారు. దీంతో దీనికి సంబంధించి.. ఈ నెల 21న బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై వీటి వివరాలు అందించాలని నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగా ఈరోజు రష్మిక తన తండ్రి మదన్, తల్లి సుమన్‌తో కలిసి మైసూర్‌లోని ఐటీ అధికారుల ముందు హాజరైయారు. అయితే తాజా సమాచారం మేరకు 25 లక్షల క్యాష్‌తో పాటు లెక్కల్లో చూపని ఆస్తి పత్రాల విలువ దాదాపు 3.94 కోట్లకు వుంటుందని సమాచారం. దీనికి తోడు రష్మిక 1.5 కోట్లకు సంబందించి పన్ను చెల్లించాలేదని తెలుస్తోంది. మరోవైపు ఈ విషయంపై రష్మిక మేనేజర్‌ స్పందిస్తూ.. ఐటీ అధికారుల తనిఖీలు పూర్తిగా ఆమె తండ్రి ఆస్తికి సంబంధించిందని తెలిపారు. అది అలా ఉంటే రష్మిక తాజాగా మహేష్‌తో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు