Rashmika Mandanna: సినీ ఇండస్ట్రీలో పరిచయమయ్యే నటీనటుల్లో కొందరు నటనపై ఆసక్తి ఉండటంతో సినీ పరిశ్రమకు పరిచయం అయిన వాళ్ళు ఉంటే.. మరికొందరు అసలు నటన జీవితాన్ని ఊహించుకోకుండానే సినిమాల్లోకి వచ్చినవాళ్లు ఉన్నారు. పలువురు నటీనటులు తాము తమ గురించి కొన్ని సందర్భాల్లో చెప్పగా.. తమ లక్ష్యం సినిమాలపై కాకుండా ఇతర రంగాల్లో ఉండేవని తెలిపారు. ఇప్పటికీ కొంతమంది నటీనటులు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుని సినిమాల్లోకి అడుగు పెట్టగా.. మరికొందరు తమ లక్ష్యాన్ని వదిలేసుకుని సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇదిలా ఉంటే రష్మిక కూడా తన లక్ష్యాన్ని వదులుకొని సినిమాల్లోకి అడుగు పెట్టింది.
టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థానంలో నిలిచింది. ఈ అమ్మడు అతి తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంది ఈ బ్యూటీ. కానీ ఈ ముద్దుగుమ్మ లక్ష్యం ఇది కాదట. అసలు తను నటిగా అవుతుందని అనుకోలేదట. తనకు వేరే లక్ష్యం ఉందని వాటి పైనే తన దృష్టి ఉందని తెలిపింది. ఈ విషయం గురించి ఈ బ్యూటీ ఈ విధంగా మాట్లాడుతూ..
ఆమె మైసూర్ కాలేజీ రోజుల్లో చదువుతున్న సమయంలో తన ఊహలు భిన్నంగా ఉండేవట. ఆమెకు టీచర్ వృత్తిలో ఆసక్తి ఉండేదట. ఒకవేళ అది సాధ్యం కాకపోతే తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుందామనుకుందట. అంతేకాకుండా టీచర్ వృత్తిపై ఉన్న ఆసక్తితో సైకాలజీ, ఇంగ్లీష్ సాహిత్యంలో డిగ్రీ కూడా పూర్తి చేసిందట.
కానీ ఇప్పుడు తన జీవితాన్ని వెనుకకు తిరిగి చూసుకుంటే అంతా ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా ఈ నటన జీవితం గురించి ఊహించలేని ఆమెకు.. ఇది విధిరాత అంటూ, అన్నిటికంటే విధి మన జీవితాన్ని బలంగా నిశ్చయించే విషయం తనకు ఇప్పుడు అర్థమైందంటూ తెలిపింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aim teacher, Bollywood, Chalo film, Rashmika mandanna, Tollywood