news18-telugu
Updated: December 4, 2020, 10:30 PM IST
రామ్ చరణ్,రష్మిక మందన్న (Twitter/Photo)
Rashmika-Acharya-Ram Charan | లాక్ డౌన్ తర్వాత కొరటాల శివ.. ఆచార్య సినిమా షూటింగ్ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే చిరు లేని సీన్స్‌ను పిక్చరైజ్ చేసాడు. ఈ గురువారం నుంచి చిరంజీవి ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ వీకెండ్ వరకు షూటింగ్లో పాల్గొని ఆ తర్వాత నిహారిక మ్యారేజ్ కోసం రాజస్థాన్‌లో ఉదయపూర్ ప్యాలెస్‌కు వెళ్లనున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయన్‌గా నటిస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో రామ్ చరణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే జక్కన్న కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రష్మికను ఖరారు చేసారు.ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ హీరోను కవర్ చేసుకుంటూ వచ్చిన రష్మిక ఇప్పుడు చరణ్‌తో కూడా రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనేది టాక్.

రామ్ చరణ్,రష్మిక మందన్న (Twitter/Photo)
కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం చరణ్‌ను అడిగితే వెంటనే ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్ర అని తెలుస్తుంది. బయటికి వచ్చిన ఫోటోలు చూస్తుంటే చిరు నక్సలైట్ అని అర్థమవుతుంది. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ సంక్రాంతి తర్వాత 21 రోజలు డేట్స్ కేటాయించాడు. ఇక రష్మిక కూడా సంక్రాంతి తర్వాత ఈ మూవీ కోసం 14 రోజులు డేట్స్ కేటాయించినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో రష్మిక పాత్ర కొద్ది సేపే ఉంటుంది. వీళ్లిద్దరి మధ్య కొన్ని లవ్ సీన్స్‌తో పాటు ఓ పాట కూడా ఉంటుంది. చిన్న నిడివి ఉన్న పాత్ర అయినా.. మెగాస్టార్..మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తోన్న చిత్రం కావడంతో వెంటనే రష్మిక తన డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ సినిమా కోసం కేటాయించినట్టు సమాచారం. అంతేకాదు రామ్ చరణ్ నెక్ట్స్ చేయబోయే చిత్రంలో హీరోయిన్గా కూడా ఎంపిక చేసారట. అందకే వెంటనే ఈ సినిమా కోసం తన డేట్స్‌ను అడ్జస్ట్ చేసింది రష్మిక. ఈ సినిమా కోసం రష్మికకు దాదాపు రూ. 1 కోటి వరకు ఛార్జ్ చేసినట్టు సమాచారం.

చిరంజీవి,కొరటాల శివ మూవీ ఓపెనింగ్ (Twitter/Photo)
దాదాపు అరగంట పాటు ఇందులో చరణ్ పాత్ర ఉంటుందని.. కథను మలుపు తిప్పేలా ఉండబోయే ఈ పాత్ర కోసం చరణ్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం మాత్రం రెజీనాని తీసుకోవడం.. ఇప్పటికే ఆమెపై ఆ స్పెషల్ సాంగ్ చిత్రీకరించడం కూడా జరిగాయి. ఇప్పుడు చరణ్, రష్మిక జోడిగా కనిపించబోతున్నారు. ఏదేమైనా కూడా చాలా స్పెషల్స్‌తో చిరంజీవి ఆచార్య వచ్చేస్తుంది. 2021 సమ్మర్లో ఏప్రిల్ 9న ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా చిరంజీవి సినిమాను నిర్మిస్తున్నాయి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 4, 2020, 10:30 PM IST