హోమ్ /వార్తలు /సినిమా /

యాంకర్ రష్మీ పెళ్లి.. ఇదిగో ప్రూఫ్! వరుడి విషయంలో ఇదెక్కడి ట్విస్టండీ బాబోయ్..

యాంకర్ రష్మీ పెళ్లి.. ఇదిగో ప్రూఫ్! వరుడి విషయంలో ఇదెక్కడి ట్విస్టండీ బాబోయ్..

Photo Twitter

Photo Twitter

బుల్లితెర ఆడియన్స్‌ని తనదైన టాలెంట్‌తో ఎంటర్‌టైన్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చే రష్మీ గౌతమ్ పెళ్లి ఇష్యూ పలు రకాలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇప్పటికే యాంకర్ రష్మీ పెళ్లి జరిగిందని, సీక్రెట్‌గా ఆమె కాపురం పెట్టిందని బోలెడన్ని వార్తా సమాచారాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వీడియో మరింత క్యూరియాసిటీ పెంచేసింది.

ఇంకా చదవండి ...

యాంకర్ రష్మీ పెళ్లి (Rashmi Marriage) అనే మాట ఎప్పటీకీ ఇంట్రెస్టింగ్ పాయింటే. బుల్లితెర ఆడియన్స్‌ని తనదైన టాలెంట్‌తో ఎంటర్‌టైన్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చే రష్మీ గౌతమ్ (Rashmi Gautam) పెళ్లి ఇష్యూ పలు రకాలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇప్పటికే యాంకర్ రష్మీ పెళ్లి జరిగిందని, సీక్రెట్‌గా ఆమె కాపురం పెట్టిందని బోలెడన్ని వార్తా సమాచారాలు బయటకు వచ్చాయి. రష్మీ పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేదనే టాక్ బయటకొచ్చింది కానీ అందులో నిజానిజాలపై ఎలాంటి క్లారిటీ అయితే లేదు. దీనిపై ఫుల్లుగా డిస్కషన్స్ నడుస్తున్న ఈ తరుణంలో తనకు బాగా అచ్చొచ్చిన ప్రోగ్రాం ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో పెళ్లి కూతురుగా కనిపించి ఆశ్చర్యపరిచింది రష్మీ గౌతమ్. అంతేకాదు తనకు కాబోయే వాడిని సీక్రెట్‌గా ఉంచేసి జనాల్లో క్యూరియాసిటీ పెంచేసింది.

రష్మీ పెళ్లి మాటేమో గానీ ఇప్పటికే బుల్లితెరపై ఆమెకు చాలాసార్లు పెళ్లి చేసేసింది మల్లెమాల టీం. జబర్దస్త్ వేదికపై పెళ్లి కూతురిగా కూర్చోబెట్టి ఆమె మెడలో మూడు ముళ్ళు వేయించిన సందర్భాలు బాగానే చూసాం. అయితే ఇవన్నీ భారీ టీఆర్ఫీ దక్కించుకోవడానికి వేస్తున్న ప్లాన్స్ అని తెలిసినా పెళ్లి బట్టల్లో రష్మిని చూసి తెగ మురిసిపోతున్నారు ఆమె ఫ్యాన్స్.

ఇదిలాఉంటే సుడిగాలి సుధీర్- రష్మీ లవ్ మ్యాటర్ అనేది మరో ట్రాక్. జబర్దస్త్ కారణంగా కలిసిన ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని ఓ రేంజ్‌లో టాక్ నడిచింది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి జబర్దస్త్ మ్యారేజ్ కూడా అయింది. రష్మీ- సుడిగాలి సుధీర్ మ్యారేజ్ ఎపిసోడ్స్‌తో జనాలకు కిక్కివ్వడమే గాక భారీగా టీఆర్పీ దక్కించుకున్నారు. దీంతో ఈ టెక్నిక్ బాగా వర్కవుట్ అవుతుందని భావించి వర్ష- ఇమ్మాన్యుయేల్ లాంటి జబర్దస్త్ కమెడియన్ల పెళ్లి కూడా చేసేశారు ప్రోగ్రాం నిర్వాహకులు.

Rashmi Marriage యాంకర్ రష్మీ పెళ్లి
Photo Twitter

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రష్మిని పెళ్లి పీటలపై కూర్చోబెట్టి పసుపు బట్టలతో చూపించి ఆసక్తి పెంచారు. కాకపోతే ఈ సారి పక్కన కూర్చున్న వరుడు ఎవరు అనేది రివీల్ చేయకుండా క్యూరియాసిటీ పెంచారు. వరుడి ముఖాన్ని మల్లెపూలతో నింపేసి ఎవ్వరూ గుర్తుపట్టకుండా దాచేశారు. ఈ జబర్దస్త్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ రష్మీ పక్కన కూర్చున్న ఆ వరుడు ఎవరు? అనే కోణంలో డిస్కస్ చేసుకుంటున్నారు. మొత్తానికైతే ఈ రూపంలో మే 27న ప్రసారం కాబోతున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ఎపిసోడ్‌పై క్యూరియాసిటీ పెంచేశారు. సో.. ఫుల్ ఎపిసోడ్ లోనే చూడాలి మరి రష్మిని పెళ్లాడిన ఆ వరుడు ఎవరనేది?.

First published:

Tags: Anchor rashmi, Rashmi gautham, Rashmi marriage, Sudigali sudheer

ఉత్తమ కథలు