రాళ్లు కాదు బిస్కెట్లు వెయ్యండి... రష్మీ గౌతమ్ హార్ట్ టచింగ్ మెసేజ్

Rashmi Gautham : జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ మరోసారి కుక్కలపై తన ప్రేమను చాటుకుంది. కుక్కలతో స్నేహం చెయ్యమని కోరుతోంది.

news18-telugu
Updated: December 23, 2019, 9:01 AM IST
రాళ్లు కాదు బిస్కెట్లు వెయ్యండి... రష్మీ గౌతమ్ హార్ట్ టచింగ్ మెసేజ్
రష్మీ గౌతమ్ (credit - insta - rashmigautham)
  • Share this:
Rashmi Gautham : రోడ్డుపై వెళ్లేటప్పుడు మనకు చాలా కుక్కలు కనిపిస్తాయి. ఒక్కోసారి అవి అరుస్తాయి. ఒక్కోసారి కరిచేందుకు కూడా వస్తాయి. అలాంటి కుక్కలపై రాళ్లు వేస్తే... అది బుద్ధి తక్కువ పనే అవుతుందంటోంది ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో యాంకర్, టాలీవుడ్ బ్యూటీ రష్మీ గౌతమ్. అదే కుక్కలపై రాళ్లు వేయకుండా... వాటికి బిస్కెట్లు పెడితే... ఆ కుక్కలు ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి. ఒక్కోసారి తమ ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యకుండా... తమ యజమానిని కాపాడతాయి. అలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి కూడా. ఇదే విషయాన్ని మెసేజ్ రూపంలో చెప్పింది రష్మీ గౌతమ్. కుక్కలకు బిస్కెట్లు వేసి... వాటితో స్నేహం చేసేవారు తెలివైన వారని రష్మీ మెసేజ్ ఇస్తోంది.

రాళ్లు కాదు బిస్కెట్లు వెయ్యండి... రష్మీ గౌతమ్ హార్ట్ టచింగ్ మెసేజ్


ఒక్కోసారి ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కలు కూడా... సొంతవారిని కరుస్తాయి. ఇందుకు అనేక కారణాలుంటాయి. కుక్కలకు ఒక్కో సమయంలో... ఎక్కువ శబ్దాలు విన్నా, వాతావరణంలో వేడి ఎక్కువైనా తిక్క రేగుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో కుక్కలు తీవ్రంగా స్పందిస్తాయి. అందుకు కారణం అతి వేడే తప్ప... స్వాభావికంగా కుక్కలు తమను కాపాడేవారికి హాని చెయ్యవు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్న యానిమల్ డాక్టర్లు... కుక్కల్ని పెంచుకోవచ్చనీ, అవి కరవకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలనీ, వాటికి ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు వేయిస్తూ ఉంటే... పొరపాటున అవి కరిచినా... మనకు ఎలాంటి సమస్యా రాదంటున్నారు.

బంబుల్‌తో రష్మీ గౌతమ్ (credit - insta - rashmigautham)


మూగ జీవాలంటే ప్రాణంగా ఉండే రష్మీ కూడా... ఓ కుక్కపిల్ల (బంబుల్)ని పెంచుతోంది. అదంటే ఎంతో ప్రాణంగా చూసుకుంటుంది. ఎప్పటికప్పుడు దానికి సంబంధించి అన్ని అప్‌డేట్స్ తన ఫాలోయర్లతో చెబుతోంది. ఈమధ్య కుక్కలపై దాడులు ఎక్కువవుతున్నాయనే వార్తలు వస్తుండటంతో... రష్మీ గౌతమ్ ఈ మెసేజ్ పెట్టినట్లు తెలిసింది.
Published by: Krishna Kumar N
First published: December 23, 2019, 8:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading