రష్మీ గౌతమ్ చేసిన పనికి కాలర్ ఎగరేస్తున్న అభిమానులు.. శభాష్ అంటూ..

అవును రష్మీ గౌతమ్ చేసిన పనికి ఆమె అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్‌ను కామెడీ స్కిట్స్ కోసం కాకుండా ఈమె కోసమే చూసే వాళ్లనున్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

news18-telugu
Updated: January 19, 2020, 9:00 PM IST
రష్మీ గౌతమ్ చేసిన పనికి కాలర్ ఎగరేస్తున్న అభిమానులు.. శభాష్ అంటూ..
రష్మీ గౌతమ్ (Twitter/photo)
  • Share this:
అవును రష్మీ గౌతమ్ చేసిన పనికి ఆమె అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్‌ను కామెడీ స్కిట్స్ కోసం కాకుండా ఈమె కోసమే చూసే వాళ్లనున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక స్మాల్ స్క్రీన్ పై తన యాంకరింగ్‌తో రచ్చ చేసిన ఈ భామ.. సిల్వర్ స్క్రీన్ పై రఫ్పాడించేసింది. అప్పట్లో ఈ భామ నటించిన ‘గుంటూరు టాకీస్’ సినిమా.. కేవలం రష్మీ గ్లామర్ కోసమే ప్రేక్షకులు చేసారంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత అడపదడపా కొన్ని సినిమాలు చేసిన ఏవి రష్మీ గౌతమ్‌కు సక్సెస్ అందించలేకపోయాయి. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. కేవలం నటిగా, యాంకర్‌గా పరిమితం కాకుండా సామాజిక సమస్యలపై స్పందింస్తూ ఉంటుంది.తాజాగా ఈమె చేసిన ట్వీట్‌ను రష్మీ అభిమానులు.. రీ ట్వీట్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రష్మీ గౌతమ్ గొప్ప మనసును చాటుతున్నారు. రీసెంట్‌గా రష్మీ గౌతమ్ తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో ఒకతను కోతికి బాటిల్‌తో నీళ్లు తాగిస్తున్న ఫోటోను షేర్ చేసింది. ప్రతి మనిషి సాటి మనిషికే కాకుండా.. జంతువులకు కూడా సాయం చేయడంలోనే అసలైన మానవత్వం ఉందని చాటింది. దాంతో పాటు సృష్టిలో ప్రతి జీవి విలువైందే. వాటి వల్ల ప్రకృతితో పాటు ఈ భూమి కూడా సమతుల్యతను కాపడుకుంటూ వస్తోంది. కానీ మనుషులమైన మనం మాత్రం ఈ వాతావరణాన్ని కలుషితం చేస్తూ..  వాటి ప్రాణాలను హరించడంతో పాటు రాబోయే తరాలను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నాం అంటూ గట్టి సందేశం ఇచ్చింది. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్స్‌ను అభిమానులతో పాటు మాములు జనాలు కూడా మెచ్చుకుంటున్నారు.   
View this post on Instagram

#oneplanet #bethechangeyouwanttosee

A post shared by Rashmi Gautam (@rashmigautam) on
First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు