హోమ్ /వార్తలు /సినిమా /

వాడసలు మగాడే కాదు... యువకుడిపై నిప్పులు చెరిగిన రష్మీ గౌతమ్

వాడసలు మగాడే కాదు... యువకుడిపై నిప్పులు చెరిగిన రష్మీ గౌతమ్

రష్మీ గౌతమ్ Instagram/rashmigautam

రష్మీ గౌతమ్ Instagram/rashmigautam

జబర్దస్త్ బ్యూటీ, హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ నిప్పులు చెరిగింది. ఓ యువకుడి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

    జబర్దస్త్ బ్యూటీ, హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ నిప్పులు చెరిగింది. ఓ యువకుడి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, రష్మీకి అంత కోపం ఎందుకు వచ్చిందంటే, ఓ యువకుడు కుక్కను కొట్టాడు. దీనికి సంబంధించిన ఓవీడియోను చూసి రష్మీ గౌతమ్‌కి కోపం నషాళానికి అంటింది. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలోని బ్రిజ్‌పురి బి బ్లాక్‌లో ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు. అతడిని చూసి కుక్క మొరిగింది. ఆ వెంటనే అతడు ఆ కుక్కను వెంటాడి తరిమాడు. ఆ పక్కన ఉన్న మిగిలిన కుక్కలు, కుక్క పిల్లలను కూడా చావబాదాడు. అది అంతటితో అయిపోలేదు. వెళ్లిన వ్యక్తి మళ్లీ ఓ గ్యాంగ్‌ను వేసుకుని వచ్చాడు. కుక్కలను వెంటాడడానికి కర్రలు , బెల్టులు తీసుకొచ్చాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డుఅయ్యాయి. వీధి కుక్కల మీద అమితమైన ప్రేమను చూపించే రష్మీ గౌతమ్‌కి ఆ వీడియో చూసిన తర్వాత కోపం వచ్చింది. దీంతో అతడి మీద తిట్ల దండకం అందుకుంది. ‘వీడు అసలు మగాడే కాదు. వాడి మగతనం నోరులేని జీవాల మీద చూపిస్తాడా?’ అని మండిపడింది. అలాంటి వారికి వ్యతిరేకంగా గళం ఎత్తాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Anchor rashmi, Anchor rashmi gautam, Jabardasth rashmi

    ఉత్తమ కథలు