Rashmi Gautam Sudigali Sudheer | టీవీ తెరపై రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆలీతో సరదగా ప్రోగ్రామ్‌లో పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
టీవీ తెరపై రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ పండించడంలో వాళ్లే ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. ఎక్స్ట్రా జబర్ధస్త్ వంటి కొన్ని ప్రోగ్రామ్స్ వీళ్ల కారణంగా చూసే వాళ్లనున్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా వీళ్లిద్దరు లాక్డౌన్ తర్వాత ‘ఆలీతో సరదగా’ కార్యక్రమంలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఇక వీళ్లిద్దరు తొలిసారి జబర్ధస్త్ సెట్లోనే కలుసుకుంటున్నట్టు చెప్పారు. అంతకు ముందు మేము ఒకరికొకరు తెలియదన్నారు. ఇక లాక్డౌన్ పీరియడ్‌లో రష్మి తన ఇంట్లోనే అమ్మతో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. ఆ సమయంలో వీధి కుక్కలకు తిండి పెట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. మరోవైపు సుడిగాలి సుధీర్ ఇంట్లోనే వర్కౌట్స్ చేసినట్టు చెప్పాడు. లాక్డౌన్లో తన వంట తానే వండుకు తిన్నానని చెప్పాడు. షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నపుడు సుధీర్ ఇంట్లో వండుకొని సెట్స్ తీసుకొచ్చి అందరికీ పెట్టేవాడని రష్మి గౌతమ్ చెప్పింది. అంతేకాదు కరోనా కారణంగా లాక్డౌన్ కారణంగా జీవితం అంటే ఏమిటో తెలిసొచ్చిందంటూ ఇద్దరూ చెప్పారు.
రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ (Source:ETV/Youtube)
మా వల్ల టీవీ ఛానెల్స్‌కు వెబ్‌సైట్స్‌కు మంచి పని దొరకుతుందంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఇలాంటి వార్తలు మా కుటుంబ సభ్యులు ముందుగా బాధ పడ్డా.. ఆ తర్వాత లైట్ తీసుకున్నారని చెప్పారు. ఇక మీ ఇద్దరు కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారా ? ఎవరైనా దర్శక, నిర్మాతలు మిమ్మల్ని సంప్రదించారా ? అని ఆలీ.. వీళ్లిద్దరని ప్రశ్నించగా.. ఎంతో మంది మమ్మల్ని హీరో, హీరోయిన్లుగా పెట్టి సినిమా తీయాలని వచ్చారు. ఇప్పటి వరకు మాకు సంతృప్తి ఇచ్చే కథ ఏది మా దగ్గరకు రాలేదు. ఒకవేళ వస్తే.. తప్పుకుండా సినిమా చేస్తామని రష్మి, సుధీర్ చెప్పుకొచ్చారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.