రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ ఈజ్ బ్యాక్..

రష్మి గౌతమ్,, సుడిగాలి సుధీర్ (Rashmi Gautam Sudigali Sudheer)

Jabardasth Comedy Show : ఈ రెండు, మూడు నెలల్లో తెరపై రష్మీ, సుధీర్ కలిసి అంతగా రొమాన్స్ పండించిన సందర్భాలు తక్కువే. ఆ కొరతను తీర్చేందుకు మళ్లీ సిద్ధమయ్యారు.

 • Share this:
  రష్మీ, సుధీర్ అంటే చాలు.. బుల్లితెర ప్రేమ జంట అనేస్తారు. వీరిద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే షోకే అందం వచ్చినట్లు కనిపిస్తుంది. రష్మీ కొంటె చూపులు.. సుధీర్ డైలాగులు.. వీరిద్దరి మధ్య రొమాన్స్ ఇంతలా ఉందా? అనిపిస్తుంది. ప్రేక్షకులైతే వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారని, అందుకే ఇంత బాగా రొమాన్స్ పండిస్తున్నారని అనుకుంటారు. వాళ్లు మాత్రం మా మధ్య ఏం లేదంటూ చెబుతూ వస్తున్నారు. బుల్లి తెర మీద అవసరం కాబట్టి అలా నటిస్తున్నామని అంటున్నారు. కార్యక్రమ నిర్వాహకులు ఏది చెబితే అది చేయాల్సిందేనంటున్నారు. అయితే.. ఈ రెండు, మూడు నెలల్లో తెరపై వారిద్దరు కలిసి అంతగా రొమాన్స్ పండించిన సందర్భాలు తక్కువే. ఆ కొరతను తీర్చేందుకు మళ్లీ సిద్ధమైంది రష్మీ, సుధీర్ జంట. వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదలైన సంగతి తెలిసిందే.

  ఆ ప్రోమోలో సుధీర్ స్కిట్‌లో భాగంగా రష్మీ కేరెక్టర్‌లో సహనటి విద్యుల్లేక రామన్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె కాసేపు సుధీర్ కేరెక్టర్‌లో ఉన్న బాబును ఓ ఆటాడుకుంటుంది. ఆ తర్వాత రష్మీ, సుధీర్ ఎంట్రీ ఇస్తారు. అప్పుడు సుధీర్‌ను బెల్ట్‌తో కొట్టాలని రష్మీని అడగ్గా.. సరేనంటూ బెల్ట్ తీసుకుంటుంది. వెంటనే.. నా శరీరాన్ని గాయపర్చు కానీ, నా మనసును గాయపర్చకు అంటూ సుధీర్ డైలాగ్ వేయగానే.. రష్మీ బుగ్గలు ఎర్రవిగా మారిపోయాయి. బెల్ట్ కొట్టేందుకు ముందుకు వచ్చినా కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ అలాగే ఉండి పోతాడు. ఆ టైంలో రష్మీ కూడా సిగ్గుపడుతుంది. కొట్టూ.. అంటూ రోజా అడిగినా రష్మీ అలా కొట్టీ కొట్టనట్టు కొడుతుంది. దీంతో కొట్టడంలోనూ ప్రేమ అంటూ రోజా అనగానే అక్కడున్న వాళ్లంతా ఈలలు వేయడంతో సన్నివేశం రక్తికట్టింది.

  చాలా రోజుల తర్వాత రష్మీ, సుధీర్ మునుపటి రొమాన్స్‌ను పండించడంతో ప్రోమోకే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. శుక్రవారం ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్‌లో వీరిద్దరి మధ్య రొమాన్స్‌కు సంబంధించిన సీన్స్ బాగా పండుతాయని నెటిజన్లు ఆశపడుతున్నారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: