టీవీ తెరపై రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ పండించడంలో వాళ్లే ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. అందుకే వాళ్లతోనే మళ్లీ మళ్లీ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఏ షో అయిన రష్మీ, సుధీర్ జంట ఉండే ఆ ప్రోగ్రామ్ అదిరిపోవాల్సిందే. తాజాగా ఈ టీవీలో ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో వాలంటైన్ డే సందర్భంగా మరోసారి వీళ్లిద్దరు వాలెంటైన్స్ జోడి కట్టారు. ఈ షోలో వీళ్లిద్దరు మరోసారి మెరుపు కలలు సినిమాలోని వెన్నెలవే వెన్నెలవే అంటూ వీళ్లిద్దరు టీవీ స్క్రీన్ పై చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఓ రేంజ్లో ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్.. ప్రేమ గుర్తుగా ఉన్న బెలూన్ను బహుకరించాడు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో వీళ్లిద్దరు ఢీ జోడీ గత సీజన్ ఫైనల్లో ఈ ఇద్దరూ చేసిన పర్ఫార్మెన్స్ యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపింది. సోషల్ మీడియాలో ఈ డాన్సులకు వ్యూస్ షేక్ అయిపోయాయి. అంతగా రప్ఫాడించారు సుధీర్ రష్మీ జోడీ. ఎప్పటికప్పుడు కొత్త డాన్సులతో అలరించే ఈ జోడీ.. వాలంటైన్ డే సందర్భంగా చేసిన డాన్సులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వారం రానున్న ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కచ్చితంగా హైలైట్ అయ్యేలా కనిపిస్తుంది. అందులో హగ్గులతో చెలరేగిపోయారు సుధీర్, రష్మీ. ఈ షోలో ముఖ్యంగా డాన్స్ ఒక్కటే కాకుండా అందులోనే ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసారు నిర్వాహకులు. దాంతో అటు డాన్సులు, ఇటు కామెడీతో పర్ఫార్మెన్స్ పిచ్చెక్కించారు సుధీర్ రష్మీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth comedy show, Rashmi Gautam, Sudigali sudheer, Telugu Cinema, Tollywood, Valentines Day 2020