Home /News /movies /

అందుకే రష్మీ, సుధీర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.. రోజా చెప్పినా..

అందుకే రష్మీ, సుధీర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.. రోజా చెప్పినా..

సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్

సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్

Jabardasth Comedy Show : శుక్రవారం నాడు ప్రసారమైన ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో రష్మీ కేరెక్టర్‌లో నటి విద్యుల్లేక రామన్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె కాసేపు సుధీర్ కేరెక్టర్‌లో ఉన్న బాబును ఓ ఆటాడుకుంది.

    జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ బుల్లితెరపై కనిపిస్తే షోకే అందం వచ్చినట్లు ఉంటుంది. రష్మీ కొంటెగా చూస్తే, సుధీర్ డైలాగులు విసిరితే వీరిద్దరి మధ్య రొమాన్స్ ఇంతలా ఉందా? అనిపిస్తుంది. ప్రేక్షకులైతే వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారని, అందుకే ఇంత బాగా రొమాన్స్ పండిస్తున్నారని అనుకుంటారు. రష్మీ, సుధీర్ మాత్రం తమ మధ్య ఏం లేదంటూ చెబుతూ వస్తున్నారు. బుల్లి తెరపై ఆ అవసరం కాబట్టి అలా నటిస్తున్నామని అంటున్నారు. షో నిర్వాహకులు ఏది చెబితే అది చేయాల్సిందేనంటున్నారు. అయితే.. ఈ రెండు, మూడు నెలల్లో తెరపై వారిద్దరు కలిసి అంతగా రొమాన్స్ పండించిన సందర్భాలు తక్కువే. ఆ కొరతను తీర్చేశారు రష్మీ, సుధీర్. శుక్రవారం నాడు ప్రసారమైన ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో రష్మీ కేరెక్టర్‌లో నటి విద్యుల్లేక రామన్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె కాసేపు సుధీర్ కేరెక్టర్‌లో ఉన్న బాబును ఓ ఆటాడుకుంది. ఆ తర్వాత రష్మీ, సుధీర్ ఎంట్రీ ఇస్తారు. అప్పుడు సుధీర్‌ను బెల్ట్‌తో కొట్టాలని రష్మీని అడగ్గా.. సరేనంటూ బెల్ట్ తీసుకుంటుంది. వెంటనే.. నా శరీరాన్ని గాయపర్చు కానీ, నా మనసును గాయపర్చకు అంటూ సుధీర్ డైలాగ్ వేయగానే.. రష్మీ బుగ్గలు ఎర్రవిగా మారిపోయాయి. బెల్ట్ కొట్టేందుకు ముందుకు వచ్చినా కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ అలాగే ఉండి పోతాడు. ఆ టైంలో రష్మీ కూడా సిగ్గుపడుతుంది.

    సుధీర్‌ను కొట్టూ.. అంటూ రోజా అడిగినా రష్మీ అలా కొట్టీ కొట్టనట్టు కొడుతుంది. దీంతో కొట్టడంలోనూ ప్రేమ అంటూ రోజా అనగానే అక్కడున్న వాళ్లంతా ఈలలు వేయడంతో సన్నివేశం రక్తికట్టింది. చాలా రోజుల తర్వాత రష్మీ, సుధీర్ మునుపటి రొమాన్స్‌ను పండించడంతో ప్రోమోకే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సన్నివేశం చూసిన వాళ్లంతా మళ్లీ సుధీర్, రష్మీ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎప్పటికీ బుల్లితెరపై రష్మీ, సుధీర్ మేడ్ ఫర్ ఈజ్ అదర్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Jabardasth comedy show, Nagababu, Rashmi Gautam, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు