అభిమాని చేసిన పనికి మురిసిపోతోన్న రష్మి గౌతమ్..

రష్మీ గౌతమ్.. తన అందచందాలతో పాటు చురుకైన వ్యాఖ్యానంతో వీక్షకుల్నీ కట్టిపడేస్తోన్న అందాల తెలుగు యాంకర్.

news18-telugu
Updated: December 8, 2019, 4:40 PM IST
అభిమాని చేసిన పనికి మురిసిపోతోన్న రష్మి గౌతమ్..
Instagram/rashmigautam
  • Share this:
రష్మీ గౌతమ్.. తన అందచందాలతో పాటు చురుకైన వ్యాఖ్యానంతో వీక్షకుల్నీ కట్టిపడేస్తోన్న అందాల తెలుగు యాంకర్. తనదైన శైలిలో తెలుగు టీవీ షోల్లో యాంకరింగ్ చేస్తు అలరిస్తోంది. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా సినిమా తెరపై కనిపిస్తూ తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు 2016లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రష్మీ హీరోయిన్‌గా చేసిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు, తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు ఆమె అభిమానులు. రష్మీ మరో కోణం.. సామాజిక అంశాలపై స్పందించడం. మహిళలపై రేపుల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణలోగాని స్పందిస్తూ.. ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతూ సామాజిక స్పృహా ఉన్న అందాల యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ లక్షణం మనం అందరిలో చూడలేము. రష్మి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. తన షోకు సంబందించిన పిక్స్‌ను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ తెగ సంబరపడుతోంది. ఆ ఫోటోలో రష్మి వివిధ హావభావాలతో ఉంది. తన అభిమాని షేర్ చేసిన ఆ పిక్‌ను రష్మి తన సోషల్ మీడియాలో  పోస్ట్ చేస్తూ మురిసిపోతోంది. అంతేకాదు అలా తన కోసం కష్టపడి ఆ పిక్ చేసిన అభిమానికి ధన్యవాదాలు తెలిపింది. 

View this post on Instagram
 

#happysundayeveryone Thankyou for the constant love and support #rashmigautam #lifeismagical #fanedits


A post shared by Rashmi Gautam (@rashmigautam) on

పిల్లిలా మారిన అందాల అనుపమ..
First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>