హోమ్ /వార్తలు /సినిమా /

Rashmi Gautam: హిందువుల పండుగలప్పుడే అన్నానంటారు.. రష్మీ గౌతమ్ హాట్ కామెంట్స్..

Rashmi Gautam: హిందువుల పండుగలప్పుడే అన్నానంటారు.. రష్మీ గౌతమ్ హాట్ కామెంట్స్..

రష్మీ గౌతమ్ (Image: Instagram)

రష్మీ గౌతమ్ (Image: Instagram)

Rashmi Gautam: రష్మీ గౌతమ్. జబర్దస్త్ యాంకర్. ఆమెకి జంతువులంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుక్కలంటే మహా ఇష్టం. తన సంపాదనలో కొంత భాగం కుక్కల పోషణ కోసం ఖర్చు చేస్తుంది. అలాగే, జీవహింస చేయవద్దని సూచిస్తూ ఉంటుంది.

రష్మీ గౌతమ్. జబర్దస్త్ యాంకర్. ఆమెకి జంతువులంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుక్కలంటే మహా ఇష్టం. తన సంపాదనలో కొంత భాగం కుక్కల పోషణ కోసం ఖర్చు చేస్తుంది. అలాగే, జీవహింస చేయవద్దని సూచిస్తూ ఉంటుంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం కూడా చేస్తూ ఉంటుంది. అయితే, తాజాగా రష్మీ గౌతమ్ మరో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. కోడి పందాలపై ఆమె కామెంట్ చేసింది. కోడిపందాల వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో రష్మీ గౌతమ్ పోస్ట్ చేసింది. అందులో కోళ్లకు కత్తులు కట్టి ఆడిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ వీడియోకు రష్మీ కామెంట్ ఏం పెట్టిందంటే.. ‘ఈ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, జంతువుల త్యాగాలు, సంస్కృతి పేరుతో జంతువులను కొట్టుకునేలా చేయడం కరెక్ట్ అనుకుంటే, మన ఆత్మలకు దేవుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ విషయాన్ని నేను బక్రీద్ సమయంలో కూడా చెప్పా. కాబట్టి, హిందువుల పండుగల సమయంలోనే నీకు క్రూరత్వం కనిపిస్తుందా? అని అడగొద్దు. అలాగే, గాలి పటాలను ఎగరేసేటప్పుడు నైలాన్, గ్లాస్ కోటెడ్ మాంజాలను వాడొద్దు. పండుగలంటే ఆనందాన్ని పంచేవి. చేతులకు రక్తం అంటుకుంటే ఆనందం పంచలేం.’ అని రష్మీ గౌతమ్ ఆ వీడియోకు కామెంట్ చేసింది.

ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో రష్మీ గౌతమ్ మాట్లాడుతూ.. తాను కోడి పందేల‌కు వ్య‌తిరేక‌మ‌ని అన్నారు. అది చ‌ట్ట‌బ‌ద్దం కాద‌ని, మ‌న ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం ఒక మూగ‌జీవిని అలా హింసించకూడ‌ద‌ని ర‌ష్మి తెలిపింది. కంట్లో కారం పెట్టి, వాటిని ఇబ్బంది పెట్టడం చాలా త‌ప్ప‌ని, అస్స‌లు అది మాన‌వ‌త్వం అనిపించుకోద‌ని ఆమె వివ‌రించారు. ఏ దేవుడు అలా కోరుకోడ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.


ఇక త‌న స్టేట్‌మెంట్ వ‌ల‌న చాలా మంది హ‌ర్ట్ అవ్వొచ్చ‌ని.. వారు ఎలా అనుకున్నా ఇబ్బంది లేద‌ని, కానీ తాను మాత్రం వాటికి వ్య‌తిరేక‌త‌మ‌ని వివ‌రించారు. ఒక మూగ జీవిని ఇబ్బంది పెట్టి, దాని వ‌ల్ల మ‌నం ఎంట‌ర్‌టైన్‌మెంట్ పొంద‌డం చాలా చాలా త‌ప్పు అది మ‌నం చేయ‌కూడ‌ద‌ని పేర్కొన్నారు. త‌నను కూడా ఆ పందేలు జ‌రిగే ప్ర‌దేశానికి తీసుకెళ్లాల‌ని చాలా మంది చూశార‌ని... కానీ వారికి నేను క్లియ‌ర్‌గా చెప్పాన‌ని వివ‌రించారు. ఇలా చేసే వాళ్ల కంటే చూసేవాళ్ల‌దే పెద్ద త‌ప్పు అని ర‌ష్మి చెప్పుకొచ్చారు. త‌న వృత్తి కోసం ఒక వ్య‌క్తి జంతువుల‌ను చంపడం త‌ప్పు కాద‌ని.. కానీ తినేవాళ్ల‌దే త‌ప్పు అని ఈ జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ వివ‌రించారు. అందుకే వాటిని నేను ఎంక‌రేజ్ చేయ‌న‌ని ర‌ష్మి స్ప‌ష్టం చేశారు.

First published:

Tags: Anchor rashmi, Anchor rashmi gautam, Rashmi Gautam, Rashmi gautam anchor

ఉత్తమ కథలు