తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ గౌతమ్ అంటే తెలియని వారుండరు. అంత పాపులర్ ఈ ముద్దుగుమ్మ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ మధ్య రష్మీ నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు.. తన అందచందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు ఆమె అభిమానులు. అది అలా ఉంటే ఈ అందాల యాంకర్ అనంతపురంలో తళుక్కుమంది. ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించడానికి వెళ్లిన రష్మీని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగడానికి, కరచాలనం చేయడానికి అభిమానులు ఎగబడ్డారు. అంతేకాదు ఆమెపై పూలు చల్లుతూ తమ అభిమాన యాంకర్ తమ ఊరు వచ్చిందని మురిసిపోయారు. షాపింగ్ మాల్లో దీపాన్ని వెలిగించిన రష్మీ అనంతరం అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చింది. కొన్ని సినిమాలు చేసిన ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ కొన్ని సినిమాల్లోనూ నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కోసం వ్యాపారులు రష్మీని పిలుస్తున్నారు. అందులో భాగంగా రష్మీ ఇటీవలే వైజాగ్, విజయనగరం వంటి ప్రాంతాల్లోనూ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.