ఆ విషయంలో రష్మీ గౌతమ్‌ను మెచ్చుకోవాల్సిందే..

Rashmi Gautam :  రష్మీ గౌతమ్.. తెలుగు టీవీ తెరపై తన అందచందాలతో పాటు.. చురుకైన వ్యాఖ్యానంతో అదరగొడుతూ  వీక్షకుల్నీ కట్టిపడేస్తోన్న అందాల యాంకర్.

news18-telugu
Updated: November 11, 2019, 7:07 AM IST
ఆ విషయంలో రష్మీ గౌతమ్‌ను మెచ్చుకోవాల్సిందే..
Instagram/rashmigautam
news18-telugu
Updated: November 11, 2019, 7:07 AM IST
Rashmi Gautam :  రష్మీ గౌతమ్.. తెలుగు టీవీ తెరపై తన అందచందాలతో పాటు.. చురుకైన వ్యాఖ్యానంతో అదరగొడుతూ  వీక్షకుల్నీ కట్టిపడేస్తోన్న అందాల యాంకర్. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తూ తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య రష్మీ హీరోయిన్‌గా  నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు.. ఆమె అభిమానులు. ప్రస్తుతం రష్మీ కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఓ పక్క ఇటూ టీవీల్లో వివిధ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే.. అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తూ అదరగొడుతోంది. రష్మీ మరో కోణం.. సామాజిక అంశాలపై స్పందించడం. మహిళలపై రేపుల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణలోగాని స్పందిస్తూ.. ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతూ సామాజిక స్పృహా ఉన్న అందాల యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ లక్షణం మనం అందరిలో చూడలేము.


అందులో భాగంగా రష్మీ మరో సారి ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఇటీవల ఓ వీడియోను లింక్‌ను పోస్ట్ చేసిన రష్మీ.. ఆ మూడు నిమిషాల వీడియోను చూడండని కోరింది. అంతేకాదు ఆ వీడియో చూస్తే.. మీరు మరోసారి మాంసహారం తీనరని తెలిపింది. నా కుక్క పిల్ల నా ఆహార పద్దతుల్నీ మార్చిందని చెప్పింది. ఇలా మూగ జీవాల రక్షణ, వాటి అలనాపాలనా కోసం రష్మీ తన వంతుగా సోషల్ మీడియా వేదికగా పంచుకుని అవగాహాన కల్పించడం అభినందనీయం.చిలకపచ్చ రంగు చీరలో రష్మీ గౌతమ్ అందాలు...
First published: November 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...