సుడిగాలి సుధీర్‌ని అలా మిస్ చేసుకున్న జబర్దస్త్ బ్యూటీ రష్మీ

సుడిగాలి సుధీర్‌తో ఓ సినిమాలో నటించే అవకాశాన్ని రష్మీ మిస్ చేసుకుంది.

news18-telugu
Updated: November 13, 2019, 12:19 PM IST
సుడిగాలి సుధీర్‌ని అలా మిస్ చేసుకున్న జబర్దస్త్ బ్యూటీ రష్మీ
రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ (Source: Youtube)
  • Share this:
జబర్ధస్త్‌తో హీరో రేంజ్‌కు ఎదిగిన సుడిగాలి సుధీర్... ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటైన త్రీ మంకిస్‌లో సుధీర్‌తో పాటు గెటప్ శ్రీను, రాంప్రసాద్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇందులో సుధీర్ తో పాటు రామ్ ప్రసాద్ , గెటప్ శ్రీను కూడా నటిస్తున్నారు. ఇక మరొకటి సాఫ్ట్ వేర్ సుధీర్ ఇందులో సుధీర్ కి జోడిగా ధన్యా బాలకృష్ణ నటించింది. అయితే ఈ సినిమాలో సుధీర్ సరసన మొదట రష్మీని హీరోయిన్‌గా అనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సుడిగాలి సుధీర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మీని తీసుకోవడానికి దర్శకనిర్మాతలు చాలానే ప్రయత్నాలు చేశారట.

అయితే అప్పటికే రష్మీ మరో సినిమాకు కమిటవ్వడం... ఈ సినిమాకు కావాల్సిన డేట్స్ మరో సినిమాకు ఇవ్వడంతో... ఆ ఛాన్స్ కాస్త ధన్యా బాలకృష్ణ అనే హీరోయిన్‌కు దక్కింది. ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. డిసెంబర్ మొదటివారంలో ఈ సినిమా విడుదల కానుంది.

Published by: Kishore Akkaladevi
First published: November 13, 2019, 12:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading