Rashmi Gautam : మనకు ఈ భూమి మీద ఉండే అర్హత ఉందా.. వాళ్లపై జబర్ధస్త్ (Jabardasth Comedy Show) బ్యూటీ రష్మి గౌతమ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వివరల్లోకి వెళితే.. జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది జీవితాలు మార్చి వేసింది. అందులో ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. ఈ ప్రోగ్రామ్‌కు ముందు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడుకు అంతగా కలిసి రాలేదు. కానీ జబర్దస్త్ తర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. రూపురేఖలు మారిపోయి ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎగబడే స్థాయికి వచ్చేసింది పరిస్థితి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అటు సినిమాలు.. ఇటు టెలివిజన్ షోలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం టీవీ తెరపై మాత్రమే వస్తుంది. వెండితెరపై హీరోయిన్గా రాణిద్దామనుకున్న రష్మీ గౌతమ్ ఆశలు అడియాసలే అయ్యాయి. అందుకే ఇక నుంచి సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.
ఒకవేళ కంటెంట్ బాగుంటేనే సినిమాల్లో యాక్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఏ స్టోరీ పడితే ఆ స్టోరీని ఒకే చేయకుండా... పూర్తిగా స్క్రిప్ట్‌తో పాటు తన పాత్ర నచ్చితేనే సినిమాలను ఓకే చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కేవలం రష్మి పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు.. ఆమె అభిమానులు. ఓ వైపు టీవీల్లో యాంకరింగ్, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం రష్మీ కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.
అది అలా ఉంటే రష్మిలో మరో కోణం.. సామాజిక అంశాలపై స్పందించడం. మహిళలపై రేపుల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణలోగాని స్పందిస్తూ.. ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతూ సామాజిక స్పృహా ఉన్న అందాల యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ లక్షణం మనం అందరిలో చూడలేము. తాజాగా ఈమె మరోసారి స్పందించింది. మనుషులకు ఆకలేస్టే నోరు తెరిచి అడుగుతారు. కానీ మూగ జీవాలు అడగలేవు. తాజాగా ఈమె ఫాలోవర్ ఒకరు ఒక వీడియోను ఆమెకు షేర్ చేశారు. అది చూసి రష్మి గౌతమ్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
ఈ వీడియోను మధ్యప్రదేశ్‌లోని దివాస్‌లో షూట్ చేశారు. అక్కడి మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది కొందరు వీధి కుక్కను తాడుతో కట్టి దాన్ని చితకబాదారు. సుమారు 30 నిమిషాల నిడివి ఉంది. ఈ సందర్భంగా రష్మి గౌతమ్ మాట్లాడుతూ.. ఈ అమానుషాన్ని ఎంతో మంది చూస్తుండి పోయారంటూ వాపోయింది. ఈ సంఘటనలతో మానవ జాతి ఈ భూమి ఉండే అర్హత లేదంటూ ఎమోషనల్ అయింది. రష్మి గౌతమ్ చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.