• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RASHMI GAUTAM JABARDASTH COMEDIAN SUDIGALI SUDHEER ROMANTIC SONG JALA JALA PATHAM GOES VIRAL ON SOCIAL MEDIA SR

Rashmi Gautam : వర్షం సాక్షిగా రష్మి గౌతమ్‌తో సుధీర్ రొమాన్స్.. హీటు పుట్టించిన యాంకర్స్ జోడి..

Rashmi Gautam : వర్షం సాక్షిగా రష్మి గౌతమ్‌తో సుధీర్ రొమాన్స్.. హీటు పుట్టించిన యాంకర్స్ జోడి..

Rashmi and Sudheer Photo : Youtube

Rashmi Gautam | Sudigali Sudheer : సుధీర్ రష్మిలు జబర్దస్త్ షోద్వారా ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.

  • Share this:
    సుధీర్ రష్మిలు జబర్దస్త్ షోద్వారా ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. పర్సనల్‌గా ఎలాంటీ రిలేషన్‌లో ఉన్నారో తెలియదు కానీ.. ఈ జంట గత తొమ్మిది సంవత్సరాలుగా తెలుగువారిని అలరిస్తోంది. ఇక తాజాగా రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్‌లో ఓ రొమాంటిక్ పాటకు డాన్స్ వేశారు. ఉగాది సందర్భంగా ఈ టీవీలో జాతిరత్నాలు అనే ప్రోగ్రామ్ ప్రసారం అయ్యింది. ఆ ప్రోగ్రామ్‌లో రష్మి సుధీర్‌లు ఉప్పెన సినిమాలోని జల జల జలపాతం అనే రొమాంటిక్ సాంగ్‌‌ను తమదైన స్టైల్లో చేశారు. ఉప్పెనలో ఎలాగైతే క‌ృతి శెట్టి, వైష్ణవ్ తేజ్‌లు రొమాన్స్ అదరగొట్టారో.. అచ్చం అలానే ఈ ఇద్దరూ కూడా చింపేశారు. నడిసంద్రంలో ఓ పడవ.. ఆ పడవలో ఈ ఇద్దరూ ఒంటరిగా ఉంటారు. పై నుంచి వర్షం.. ఇలా వీటి మధ్య రొమాన్స్ అదరగొట్టారనే చెప్పోచ్చు.. సినిమాలో ఏ విధంగా అయితే తీర్చి దిద్దారో.. అలానే ఈ పాటలో కూడా సరైనా గ్రాఫిక్స్ వాడుతూ.. పడవ సెట్‌లో కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్‌లను మైమరిపించారు.

    ఓ సీన్‌లో రష్మి నీళ్లు తాగుతూ.. సుధీర్‌పై అలా కవ్విస్తూ పోస్తుంది. మరో సీన్‌లో చలికి వణుకుతూ.. ఇద్దరూ ఒకే దుప్పటిని కప్పుకుంటారు. ఇలా సినిమాలో ఎలా చేశారో అలానే చేశారు. చెప్పాలంటే సినిమా కంటే బాగా చేశారని అంటున్నారు వీరి అభిమానులు.

    ఉగాది సందర్భంగా విడుదలైన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే పడవ.. సముద్రం ఇలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా...మంచి గ్రాఫిక్స్‌తో నెటిజన్స్ అలరిస్తోంది ఈ వీడియో. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్ త్రీలో ట్రెండ్ అవుతోంది. ఇక మరోవైపు వీరి అభిమానులు కామెంట్స్ చేస్తూ ఇద్దరూ ఇరగదీశారని అంటున్నారు. మరికొందరైతే సినిమాల్లోకంటే ఇక్కడే కెమిస్ట్రీ అదిరిపోయిందని అంటున్నారు. ఇక అది అలా ఉంటే రష్మి జబర్దస్త్ నుంచి బయటకు వెళ్తున్నట్లు తెలిసింది. దీంతో జబర్దస్త్ ఫ్యాన్స్ తెగ అందోళన చెందుతున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: