హోమ్ /వార్తలు /సినిమా /

రష్మి నా డార్లింగ్.. సుడిగాలి సుధీర్‌కు ప్రదీప్ ఊహించని షాక్..

రష్మి నా డార్లింగ్.. సుడిగాలి సుధీర్‌కు ప్రదీప్ ఊహించని షాక్..

సుధీర్ రష్మీ గౌతమ్ ప్రదీప్

సుధీర్ రష్మీ గౌతమ్ ప్రదీప్

Rashmi Gautam Pradeep: రష్మి గౌతమ్.. ఈ పేరు వినగానే మరో పేరు కూడా వెంటనే గుర్తొస్తుంది. అదే సుడిగాలి సుధీర్. బుల్లితెరపై వీళ్లిద్దరి కెమిస్ట్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన..

రష్మి గౌతమ్.. ఈ పేరు వినగానే మరో పేరు కూడా వెంటనే గుర్తొస్తుంది. అదే సుడిగాలి సుధీర్. బుల్లితెరపై వీళ్లిద్దరి కెమిస్ట్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడేళ్లుగా మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. సుధీర్ అంటే రష్మి.. రష్మిఅంటే సుధీర్ అనేంతగా ఈ బాండింగ్ పెరిగిపోయింది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారంతా. అయితే ఇప్పుడు సడన్‌గా యాంకర్ ప్రదీప్ మధ్యలో వచ్చాడు. ఎప్పటికప్పుడు జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా రష్మి నా డార్లింగ్ అంటూ ప్రదీప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి పుట్టిస్తున్నాయి.

రష్మి గౌతమ్ ప్రదీప్ మాచిరాజు (rashmi pradeep)
రష్మి గౌతమ్ ప్రదీప్ మాచిరాజు (rashmi pradeep)

తాజాగా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమాతో హీరోగా కూడా మారిపోయాడు ప్రదీప్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈ హీరో. అందులోనే రష్మి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు ఈయన. ఈ ఇద్దరూ కలిసి కొన్నేళ్ళుగా ఢీ ఛాంపియన్స్ షోలో చేస్తున్నారు. సుధీర్ కూడా అందులోనే ఉన్నాడు. సుధీర్, రష్మి జోడీకి అదిరిపోయే క్రేజ్ ఉంది. సుధీర్, రష్మి జోడీ కంటే కూడా వీళ్లతో ప్రదీప్ కలిస్తే వచ్చే అల్లరి మరో స్థాయిలో ఉంటుంది. ఈ ముగ్గురు ఒకేచోట కలిసారంటే నవ్వులు ఆపడం ఎవరి తరం కాదు. అంతగా నవ్వించేస్తారు.

రష్మి గౌతమ్ ప్రదీప్ మాచిరాజు (rashmi pradeep)
రష్మి గౌతమ్ ప్రదీప్ మాచిరాజు (rashmi pradeep)

ఈ షోతో పాటు జబర్దస్త్ కూడా కలిసి చేస్తున్నారు కాబట్టే సుధీర్, రష్మి మధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ ఎప్పుడూ వార్తలు వస్తుంటాయి. ఇదిలా ఉంటే తనకు రష్మి ఎప్పట్నుంచో తెలుసు అంటున్నాడు ప్రదీప్. తను రేడియో జాకీగా ఉన్నపుడు 13 ఏళ్ల కింద యువ సీరియల్ షూటింగ్ కోసం అక్కడికి రష్మి అండ్ టీం వచ్చినట్లు తెలిపాడు ప్రదీప్. అప్పట్నుంచి తామిద్దరం మంచి స్నేహితులం అంటున్నాడు ఈయన. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వేరే ప్రోగ్రామ్స్ చేసామని.. ఇప్పుడు ఢీ ఛాంపియన్స్‌లో కూడా చేస్తుండటం ఆనందంగా ఉందంటున్నాడు ఈ యాంకర్.

‘ఢీ’ యాంకర్ ప్రదీప్ (youtube/Photo)
‘ఢీ’ యాంకర్ ప్రదీప్ (youtube/Photo)

తనతో నాకు చాలా చనువు ఉందంటున్నాడు ప్రదీప్. ఇక సుధీర్ కూడా తనకు చాలా మంచి మిత్రుడు అంటూ క్లారిటీ ఇచ్చాడు. తను, రష్మి, ప్రయమణి, సుధీర్ కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని అందులో అల్లరి చేస్తుంటామని చెప్పాడు ప్రదీప్. ఇదిలా ఉంటే ప్రదీప్, రష్మి పెళ్లి అంటూ ఆ మధ్య వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

సుధీర్ రష్మీ గౌతమ్, ప్రదీప్ (sudheer Rashmi, Pradeep)
సుధీర్ రష్మీ గౌతమ్, ప్రదీప్ (sudheer Rashmi, Pradeep)

ఈ ఇద్దరూ 2020 సమ్మర్‌లోనే పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇది చూసిన తర్వాత 2020కి బెస్ట్ జోక్ ఇదే అంటూ నవ్వుకుంటున్నారు నెటిజన్లు. అయితే నిప్పు లేనిదే పొగ రాదు భయ్యో అంటూ మరికొందరు కూడా కమెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా రష్మి, ప్రదీప్ పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలపై స్పందించిన ప్రదీప్.. అవన్నీ చూసి తాను నవ్వుకుంటానని చెప్పాడు.

First published:

Tags: Anchor pradeep, Anchor rashmi gautam, Sudigali sudheer, Telugu Cinema, Tollywood