యాంకర్ రష్మీని ఘోరంగా అవమానించిన యువ హీరో...జబర్దస్త్ షో మధ్యలోనే...

అంతేకాదు యాంకర్ రష్మీ కూడా హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించడమే కాదు. ఒక లీడింగ్ నటిగా కూడా ప్రస్తుతం ఆమె చిత్రపరిశ్రమలో చలామణి అవుతోంది. అలాంటప్పుడు రష్మీని అవమానించడం తగునా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: December 1, 2019, 9:32 PM IST
యాంకర్ రష్మీని ఘోరంగా అవమానించిన యువ హీరో...జబర్దస్త్ షో మధ్యలోనే...
Rashmi Gautam Instagram/rashmigautam/
  • Share this:
యాంకర్ రష్మీ అంటే జబర్దస్త్ షోలో ఒక స్పెషల్ అట్రాక్షన్. అనసూయ యాంకరింగ్ తో జబర్దస్త్ ఎంత పాపులారిటీ సంపాదించిందో...అంతకు మించిన పాపులారిటీ ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారా రష్మీ సంపాదించింది. అయితే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో ఓ స్పెషల్ ఎంట్రీ వచ్చింది. అర్జున్ సురవరం ప్రమోషన్స్ లో భాగంగా హీరో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే స్టేజీ పైనే ఉన్న రష్మీపై యువ హీరో నిఖిల్ ఆటపట్టించాడు. రష్మీని చూసి ఆర్టిస్ట్ తన్మయ్, వినోదిని అనడమే కాదు...రష్మీ అంటే ఎవరూ అంటూ కామెంట్ చేశాడు. దీంతో యాంకర్ రష్మీ ఇబ్బందిగా ఫీల్ అయ్యిందనట్లు టాక్ వినిపిస్తోంది. రష్మీ కూడా తన తోటి నటీమణి అని తెలిసి కూడా అలా ఎలా అంటారని సోషల్ మీడియా వేదికగా రష్మీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే హీరో నిఖిల్ అభిమానులు మాత్రం ఇదంతా జబర్దస్త్ షోలో ఫన్ జనరేట్ చేయడంలో భాగంగా చేసిన ప్రయత్నమే అని తెలుస్తోంది.

అంతేకాదు యాంకర్ రష్మీ కూడా హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించడమే కాదు. ఒక లీడింగ్ నటిగా కూడా ప్రస్తుతం ఆమె చిత్రపరిశ్రమలో చలామణి అవుతోంది. అలాంటప్పుడు రష్మీని అవమానించడం తగునా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>