జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది జీవితాలు మార్చి వేసింది. అందులో ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. ఈ ప్రోగ్రామ్‌కు ముందు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడుకు అంతగా కలిసి రాలేదు. కానీ జబర్దస్త్ తర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. రూపురేఖలు మారిపోయి ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎగబడే స్థాయికి వచ్చేసింది పరిస్థితి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అటు సినిమాలు.. ఇటు టెలివిజన్ షోలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం టీవీ తెరపై మాత్రమే వస్తుంది. వెండితెరపై హీరోయిన్‌గా రాణిద్దామనుకున్న రష్మీ గౌతమ్ ఆశలు అడియాసలే అయ్యాయి. అందుకే ఇక నుంచి సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ఒకవేళ కంటెంట్ బాగుంటేనే సినిమాల్లో యాక్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఏ స్టోరీ పడితే ఆ స్టోరీని ఒకే చేయకుండా... పూర్తిగా స్క్రిప్ట్‌తో పాటు తన పాత్ర నచ్చితేనే సినిమాలను ఓకే చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తాజాగా రష్మీ గౌతమ్.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం అనసూయను అనుకున్నారు. కానీ అనసూయ ఆల్రెడీ తనకు కమిటైన ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు డేట్స్ కేటాయించలేకపోయింది.
అందుకే బోయపాటి శ్రీను ఈ పాత్రను రష్మీ గౌతమ్‌కు ఆఫర్ చేసినట్టు సమాచారం. ఇక రష్మీ గౌతమ్.. కూడా ఈ క్యారెక్టర్ నచ్చి ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రష్మీ గౌతమ్.. టీవీ షోస్‌తో పాటు వెబ్ సిరీస్‌లో నటించాలని ఫిక్స్ అయింది. 15 ఏళ్ల కింద ‘ఏ ఫిలిం బై అరవింద్’ సినిమా తెరకెక్కించి హిట్ కొట్టిన దర్శకుడు శేఖర్ సూరి ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయనున్నాడు. మొత్తానికి రష్మీ గౌతమ్.. టీవీ షోలకు హోస్ట్‌తో పాటు సినిమాలు వెబ్ సిరీస్‌లతో తన కెరీర్‌ను చాలా మంచిగానే ప్లాన్ చేసుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Boyapati Srinu, Jabardasth comedy show, Rashmi Gautam, Telugu Cinema, Tollywood