హోమ్ /వార్తలు /సినిమా /

మంచు మనోజ్, రష్మి గౌతమ్ ఇద్దరూ ఒకేసారి..

మంచు మనోజ్, రష్మి గౌతమ్ ఇద్దరూ ఒకేసారి..

మంచు మనోజ్, రష్మీ గౌతమ్ (File/Photos)

మంచు మనోజ్, రష్మీ గౌతమ్ (File/Photos)

హీరో మంచు మనోజ్, రష్మీ గౌతమ్ దారులు వేరైనా వీళ్లిద్దరు మాత్రం ఓ విషయంలో ఒకేలా స్పందించారు.

హీరో మంచు మనోజ్, రష్మీ గౌతమ్ దారులు వేరైనా వీళ్లిద్దరు మాత్రం ఓ విషయంలో ఒకేలా స్పందించారు. తాజాగా కరోనాపై పోరాటంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను దీపాలు వెలిగించమని కోరారు. అందులో భాగంగా దేశ ప్రజలందరు సరిగ్గా రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి దేశానికి తమ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దేశంలో చాలా మంది ప్రజలు ప్రధాని పిలుపుకు మంచిగానే స్పందించారు. కానీ కొంత మంది మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పటాకులు పేల్చారు. వీరిపై సోషల్ మీడియా వేదికగా చాలా మంది విమర్శిస్తున్నారు. ప్రముఖ నటుడు మంచు మనోజ్.. యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఇలాంటి చర్యలను తప్పు పట్టారు.దీనిపై మంచు మనోజ్ స్పందిస్తూ.. కొందరు ప్రజలు దీపాలు వెలిగించకుండా పటాకులు కాల్చి తోటి వారిని ఇబ్బంది పెట్టారని మంచు మనోజ్ తన ఆవేదన వెల్లగక్కాడు. తాజాగా ఓ నెటిజన్ పటాకులు కాల్చడం వల్ల మా ఇంటి పక్కన భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇది చూసి ఒళ్లు మండిన మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా ఇలాంటి పనులు చేసిన వాళ్లను ఏకి పారేసాడు. రేయ్ ఇడియట్స్.. ఈ క్రాకర్స్ కాల్చడం ఆపండ్రా.. మనం మనుషులే తప్ప మూర్ఖులం కాదు.. క్రాకర్స్ కాల్చమని మీకు ఎవరైనా చెప్పారా అంటూ మండిపడ్డాడు. జి బలిసిన చదువుకున్న వాళ్లు మాత్రమే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారు అంటూ క్రాకర్స్ కాల్చిన వాళ్లపై ఫుల్ ఫైర్ అయ్యాడు.

మరోవైపు రష్మీ గౌతమ్ కూడా ఇది దీపావళి కాదు.. దేశం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పటాకులు కాల్చి సంబరాలు చేసుకోవడం తప్పు అని చెప్పుకొచ్చింది. మొత్తానికి కొంత మంది తెలిసీ తెలియక చేసిన ఈ పని ఇక ముందైన చేయోద్దని వేడుకుంది.

First published:

Tags: Manchu Manoj, PM Narendra Modi, Rashmi Gautam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు