హోమ్ /వార్తలు /సినిమా /

సోనమ్ కపూర్‌ను ఆడేసుకున్న రష్మీ గౌతమ్.. బాధ్యత ఉండక్కర లేదా..

సోనమ్ కపూర్‌ను ఆడేసుకున్న రష్మీ గౌతమ్.. బాధ్యత ఉండక్కర లేదా..

రష్మీ గౌతమ్ Instagram/rashmigautam

రష్మీ గౌతమ్ Instagram/rashmigautam

దేశం ఇంత కష్టకాలంలో ఉన్న పరిస్థితుల్లో మీ సరదా కోసం జనాల్నీ అలా వాడేసుకుంటారా.. అంటూ సోనమ్ కపూర్‌పై మండి మడింది రష్మి.

Rashmi Gautam : తెలుగు టీవీ యాంకర్ రష్మీ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. ఈ భామ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో కామెడీ షోతో అంత పాపులర్ అయ్యింది. రష్మీ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఆ షోకు కావాల్సినంత గ్లామర్ అందిస్తూ అదరగొడుతోంది. అది అలా ఉంటే కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్యుల నుండి సెలెబ్రీటీస్ వరకు అందరూ ఇంటికే పరిమితమైపోయారు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా రకరకాల పనులు చేస్తున్నారు. కొందరూ బొమ్మలెస్తుంటే.. మరికొందరూ వంటిట్లోకి వెళ్లి వంటలు చేస్తున్నారు.  శ్రీముఖి చికెన్ బిర్యానీ చేయగా.. కాజల్ సమోసాలు చేసి అదరగొట్టింది. కాగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ చాకోలెట్ వాల్ నట్ కేక్ ఒకటి తయారు చేసిందట. దానికి సంబందించి ఓ ట్వీట్ చేసింది. నీను తాజాగా ఓ చాకోలెట్ కేక్ చేశానని.. అయితే ఇంట్లో చాక్ లెట్ లేకపోతే ఓ పుడ్ సప్లయ్ చేసే సంస్థ చాలా క్వాలిటీ గల చాక్ లెట్‌ను అందించిందని పేర్కోంది. ఇది చూసిన రష్మీ .. మీరు ఎంత ప్రివిలేజ్ అయితే మాత్రం.. దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయానా మీ సరదా కోసం చేసే ఓ కేకు కోసం అంత మందిని అక్కడికి ఇక్కడికి పంపిస్తారా.. అది అంత ముఖ్యమా..అంటూ .. మీరు ఎంత సెలెబ్రీటి అయితే మాత్రం కొంత బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందని మండిపడింది.

First published:

Tags: Rashmi Gautam

ఉత్తమ కథలు