మూడు నెలలు అవి లేకుండా ఉండలేరా.. బుద్ది లేదా అంటూ రష్మి గౌతమ్ ఫైర్..

Rashmi Gautam | స్మాల్ స్క్రీన్ చూసే ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రష్మీ గౌతమ్.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.

news18-telugu
Updated: April 18, 2020, 5:22 PM IST
మూడు నెలలు అవి లేకుండా ఉండలేరా.. బుద్ది లేదా అంటూ రష్మి గౌతమ్ ఫైర్..
రష్మీ గౌతమ్ Photo : Twitter
  • Share this:
Rashmi Gautam | స్మాల్ స్క్రీన్ చూసే ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రష్మీ గౌతమ్.. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేసే వాళ్లపై మండిపడింది. ప్రస్తుతం మన దేశం కరోనా అనే పెద్ద మహామ్మారిపై పోరాడుతోంది. కరోనాను కట్టడి చేయడం కోసం మన కేంద్రం లాక్‌డౌన్‌ను 40 రోజలు వరకు పొడిగించింది. అంతేకాదు అందరు సోషల్ డిస్టన్స్ పాటిస్తే.. ఈ మహామ్మారిని మన దేశం నుంచి తరిమి కొట్టొచ్చు. కానీ కొంత మంది మాత్రం లాక్‌డౌన్‌ను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇష్టమొచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్నారు. చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి రావడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరైనా అత్యవసరాలు, నిత్యవసరాల కోసం మాత్రమే బయటకు రావాలి. కానీ కొద్ది మంది మాత్రం చిన్న చిన్న కారణాలతో బయటకు వస్తున్నారు.

రష్మీ గౌతమ్ Instagram/rashmigautam
రష్మీ గౌతమ్ Instagram/rashmigautam


ఒకసారి పెన్సిల్, మరోసారి రబ్బర్ అంటూ తిరుగుతున్నారు. సూపర్ మార్కెట్ లోపలకి  ఒకసారి 5-10 మందిని మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ప్రతిసారీ మీరు సూపర్ మార్కెట్‌కు వెళ్తే.. నిజంగా అవసరమైన వాళ్లు సూపర్ మార్కెట్ వెళితే.. గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోందన్నారు. అందరు ఏదైనా అవసరం అయితే ఒకేసారి తెచ్చుకోండి.. చీటికి మాటికి మాత్రం బయటకు రావొద్దంటూ విన్నవించుకుంది. మిగిలిన సమయంల ఇంట్లో ఉండి ఇంటి పని చూసుకొండి. తోట పని చేసుకోవచ్చు. ఇళ్లంత క్లీన్ చేసుకోవచ్చు. చిరంజీవి లాంటి వాళ్లే ఇంటి పని చేస్తుంటే మీ కేంటి ? మీకేమి హాలీడేస్ ఇవ్వలేదు కదా అంటూ ఫైర్ అయింది. ఇంకొందరు ఒక అడుగు ముందకేసి పిజ్జాలు, బర్గర్లు  అంటూ రోడ్లపైకి వస్తున్నారు. మూడు నెలల పాటు అవి తినకపోతే ఏమవుతోంది. ? వాటిపై ఎందుకంత మోజో.. నాకైతే అర్ధం కావడం లేదు.

rashmi gautam latest pics,rashmi gautam,rashmi gautam movies,rashmi,jabardasth rashmi,rashmi gautam age,anchor rashmi gautam,rashmi gautham,anchor rashmi,rashmi gautam real life,rashmi gautam interview,rashmi gautam biography,rashmi gautam exclusive interview,rashmi gautam songs,rashmi gautam family,rashmi gautam videos,rashmi gautam new movie,rashmi gautam net worth,rashmi gautam lifestyle,rashmi gautam video songs,rashmi sudheer,జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్,రష్మీ గౌతమ్ పిక్స్,Rashmi Gautam poses for a super hot pic shares on insta
రష్మీ గౌతమ్ ( Instagram/Photo)


ఈ లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు.. పప్పు, చపాటీ ఇంట్లో ఉన్న ఏదో ఒక దానితో సర్ధుకుపోలేరా ? పారిశుద్ధ కార్మికులు మూడు పూటల పనిచేస్తున్నారు. కరోనా కారణంగా చెత్త సేకరించేందకు అపార్టెమెంట్‌తో మీ ప్లాట్‌కు వచ్చిన చెత్త తీసుకెళ్లేవాళ్లు ఒకరే ఇంటికి వస్తున్నారు. అన్ని ప్లాట్స్ తిరిగి చెత్త కలెక్ట్ చేయాలంటే వాళ్లకు ప్రాబ్లమే. ఇలాంటి సమయంలో అందరు చెత్త బండి దగ్గరకు వెళ్లి చెత్త వేస్తే బాగుంటుందన్నారు. మొత్తానికి  అందరూ ప్రభుత్వం చెప్పే సూచనలు పాటిస్తే.. కరోనాను తరిమికొట్టడం పెద్ద పనేం కాదు అని చెప్పుకొచ్చింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 18, 2020, 5:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading